నాకెందుకు ఈ పరీక్ష- మంచు విష్ణు నిర్వేదం

Manchu Vishnu's Kannappa: ప్రముఖ నటుడు మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన హార్డ్‌ డ్రైవ్‌ చోరీకి గురైంది. దీనిపై యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మూవీ కన్నప్ప. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 27వ తేదీన విడుదల కావాల్సి ఉంది. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, దేవరాజ్.. వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

Manchu Vishnu reaction on Kannappa movie hard drive missing

వీఎఫ్ఎక్స్ వర్క్స్ దాదాపుగా పూర్తయిన సమయంలో హార్డ్ డిస్క్ మాయం కావడం కలకలం రేపింది. దీనిపై సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచారు.

కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ డిజైన్ చేసింది. ఈ విజువల్స్ పొందుపరిచిన హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర లో గల 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది.

ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు చేరగా.. అక్కడ పని చేసే ఆఫీస్‌ బాయ్‌ రఘు అందుకున్నాడు. ఈ విషయాన్ని అతను తనకు గానీ, అక్కడ ఉండే ఇతర సిబ్బందికి గానీ చెప్పలేదని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ హార్డ్ డ్రైవ్ ను ఆఫీస్ లో పని చేసే మహిళకు ఇచ్చాడని, అప్పటి నుంచి ఇద్దరూ కనిపించట్లేదని అందులో వివరించారు.

సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో రఘు, ఆ మహిళ ఈ కుట్రకు పాల్పడినట్లు విజయ్‌ కుమార్‌ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ కుమార్ ద్వారా 24 ఫ్రేమ్స్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీలను సేకరించినట్లు సమాచారం. వాటిద్వారా రఘు, ఆ మహిళ కదలికలపై ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలపై మంచు విష్ణు స్పందించారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారాయన. 200 కోట్ల రూపాయల బడ్జెట్ కావడం, ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకుంటోన్న ఉదంతాలు ఆయనను నిరాశలోకి నెట్టేసినట్టయింది. నిర్వేదభావంతో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

జటాజూఠధారీ, నీ కోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. అని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో త్రిశూలం బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఓ స్లైడ్ పోస్ట్ చేశారు. తెలుగు, హిందీ ఇది పోస్ట్ అయింది. విడుదల తేదీనీ వెల్లడించారు. 27వ తేదీ నాడే ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+