Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ ర్యాంపేజ్.. RRR రికార్డ్స్ బద్దలు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ సృష్టిస్తోంది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా సాగుతోంది. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్ షోలతో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయి రూ.300 కోట్లు దిశగా పరుగులు తీస్తోంది. ఈ మూవీ బుక్ మై షో లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుక్‌ మైషోలో ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవగా.. అత్యంత వేగంగా ఆ ఘనతను అందుకున్న తొలి రీజనల్ మూవీగా చిరంజీవి సినిమా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన 6 రోజుల్లోనే ఈ మూవీ రూ. 300 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది. 70 ఏళ్ల వయసులోనూ చిరంజీవి తగ్గని జోరు అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.


ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ మరో ఘనత సాధించారు. తన కుమారుడు రామ్ చరణ్, సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ బెస్ట్ రికార్డులను 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదోరోజు ఆర్ ఆర్ ఆర్ రూ. 20.75 కోట్లు (గ్రాస్) వసూల్ చేసింది. అదే సమయంలో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రూ. 20.75 కోట్లు (గ్రాస్) సాధించింది.

Mega Supremacy Chiranjeevi s MSG Shatters RRR amp amp OG Records Day 5 Telugu States High Beats Rajamouli s Epic

అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాను కూడా చిరంజీవి సినిమా బ్రేక్ చేసింది. బుక్‌ మైషోలో 'ఓజీ' సినిమాకు మొత్తం 27.8 లక్షలు టికెట్లు సోల్డ్ అయ్యాయి. అయితే ఆ సినిమాకు లాంగ్​ రన్ ​లో జరిగిన మొత్తం టికెట్ల అమ్మకాలు ఇవీ. కానీ చిరంజీవి ఈ రికార్డును కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీకి బుక్‌ మైషోలో 28.1 లక్షలు టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అటు గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రికార్డుల్ని ఈ మూవీ బ్రేక్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+