Megastar: జీవితంలో దేనికీ షార్ట్‌కట్స్‌ ఉండవు.. మనస్సులో మాట చెప్పిన చిరు..!

మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పారు. అలాగే.. జీవితంలో ఎలా ముందుకెళ్లాలో కూడా వివరించారు. డబ్బు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని.. దాన్ని కాపాడుకోవడం గొప్పని సందేశం కూడా ఇచ్చారు. చిరు చెప్పిన మాటలు చాలా మందికి ఆదర్శంగా నిలవనున్నాయి. చిరు కొద్ది రోజుల క్రితం తెలుగు డిజిటల్‌ మీడియా ఫెడరేషన్‌ వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

జీవితంలో చాలా సింపుల్ గా తొందరగా ఎదగాలని అనుకుంటారు. అయితే జీవితంలో దేనికీ షార్ట్ కట్స్ ఉండవని మెగాస్టార్ చెప్పారు. ఎన్నో ఎత్తుపల్లాలు దాటితే విజయం సాధిస్తారని చెప్పారు. ఎదుగుతున్న క్రమంలో అవమానాలు కూడా ఉంటాయని ఓ సంఘటన గురించి చిరు వివరించారు. తాను న్యాయం కావాలి సినిమా చేస్తున్నప్పుడు నిర్మాత క్రాంతి కుమార్ అన్న మాట తీవ్ర వేదనకు గురి చేశాయని అన్నారు.

Megastar Chiranjeevi talks about an incident in his life

కానీ ఆ మాటలే తనలో పట్టుదల పెంచాయని చెప్పారు. షూటింగ్ సందర్భంగా క్రాంతి కుమార్ క్రేన్ లో పైన నిల్చున్నారని తెలిపారు. అప్పుడు తను బయట ఉన్నట్లు చెప్పారు. అయిత అసిస్టెంట్ డైరెక్టర్ పిలవగానే లోపలికి వచ్చినట్లు వివరించారు. కానీ క్రాంతి కుమార్ మాత్రం.. ఏంటండీ.. మిమ్మల్ని కూడా పిలవాలా.. మీరేమైనా సూపర్ స్టారా అని అన్నారని చిరు గుర్తు చేశారు. ఇక్కడ జగ్గయ్య, శారద వంటి నటులు లేరా అని అరిచినట్లు చెప్పారు.

ఆ మాటలతో తన గుండె చివుక్కుమందన్నారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయాలేదని చిరు చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత క్రాంతి కుమార్ ఫోన్ చేసి ఒత్తిడిలో అలా అన్నట్లు చెప్పారని పేర్కొన్నారు. కానీ ఆయన అన్న మాటలతో స్టార్ కావాలని ఆరోజే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అంతే కాదు.. తాను ఒక పెద్ద హీరో అయినా.. ఇప్పటికీ షాంపూ అయిపోతే అందులో నీల్లు పోసుకుని వాడుతానని చిరంజీవి నిడారంబరంగా చెప్పారు. అరిగిపోయిన సబ్బు ముక్కల్ని ఒకటి చేసి వారు రోజులకైనా వాడతామని చెప్పారు.

ఇంకా మాట్లాడుతూ.. 'మేము పెద్ద హీరోలమైనా సరే అయిపోయిన షాంపూ బాటిల్‌లో నీళ్లు పోసి దాన్ని వాడుకుంటాం. అలాగే నేను అయిపోయిన సబ్బు ముక్కలన్నీ కలిపి ఒక సబ్బుగా తయారు చేసి వారం రోజులవరకైనా వాడుతాను. నీటిని ఎక్కువగా వృథా చేయను. లైట్లు ఆఫ్‌ చేశారా? లేదా? అని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేస్తాం. మీ అందరు కూడా ఇలాంటి చిన్నచిన్నవి పాటించాలి' అని చిరంజీవి సూచించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+