డెడ్లీ కాంబో.. మెగాస్టార్ నటిస్తున్న మూవీలో విలన్‌గా మోహన్ బాబు..!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ హీరో.. రీసెంట్ గానే హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అటు నిర్మాతగా కూడా 'కోర్టు' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో "ది ప్యారడైజ్ " మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'దసరా' మంచి హిట్ సాధించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం సెన్సేషన్ గా మారాయి. చేతిపై లం********* కు అనే టాటూ, అసభ్య పదజాలం మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. ఇందులో నాని 'జడల్' అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్స్ రిలీజ్ కాగా నాని ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో డిస్కషన్ ప్రకారం ఈ చిత్రంలో విలన్ గా సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కథ నచ్చడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ఇది రూమరేమో అని అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి ఈ విషయాన్ని బయటపెట్టేసింది.
తాను నటిస్తోన్న ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న మంచు లక్ష్మి మోహన్‌బాబు క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ 'ది ప్యారడైజ్' అప్‌డేట్ ఇచ్చారు. తన లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యా. ఆయన స్థాయిలో ఉన్న మరో నటుడైతే ఎలా ఉంటే అలాగే నటిస్తానని కండిషన్లు పెడతారు. కానీ నాన్న మాత్రం క్యారెక్టర్ కోసం తనని తాను మలుచుకుంటున్నారని తెలిపారు మంచు లక్ష్మి. దీంతో మోహన్‌బాబు నటిస్తున్నారని ఫిక్స్ అవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
We went all in.
— Nani (@NameisNani) August 11, 2025
We are ready to go all out now.
Wrapped up an intense one.
Gearing up for the next schedule.#TheParadise https://t.co/WsHdXv7Mt5@odela_srikanth 🔥@anirudhofficial 🔥 pic.twitter.com/xJ4Mjr3ZZb
మరోవైపు ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఓ క్యామియో రోల్ ని .. చిరంజీవితో చేయించాలని శ్రీకాంత్ ఓదెల అనుకున్నారట. ఈ మేరకు మెగాస్టార్ ని కలిసి కథ వినిపించగా అందుకు ఒకే చెప్పారని సమాచారం. శ్రీకాంత్ ఓదెల తన నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తున్నారు. ఈ రిలేషన్ కారణంగానే మెగాస్టార్ చిరంజీవి ఇందులో నటిస్తున్నారని ఫిక్స్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications