Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !!

ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రమోట్ చేయడం అంతకంటే పెద్ద సవాలుగా మారింది. పెద్ద నిర్మాతలు అయితే భారీ బడ్జెట్‌లతో ప్రమోషన్స్‌ను దుమ్మురేపుతుంటారు. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో రూపొందే చిన్న సినిమాల పరిస్థితి మాత్రం అంత సులభం కాదు. అయితే ఇటీవల ఒక సినిమా మాత్రం తన వినూత్నమైన ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్".

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్". ఈ సినిమాకు మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించగా.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, ఈ చిత్రబృందం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

mr-work-from-home-movie-title-and-team-promotions-creating-huge-buzz-on-telugu-film-industry-about-r

వినూత్నంగా ప్రమోషన్స్..

రైతులకు ఉపయోగపడే అంశంతో మూవీ తెరకెక్కడంతో.. సినిమా ప్రమోషన్‌ను కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కాన్సెప్ట్‌ను వివరించారు. సాధారణంగా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి.

అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్" సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, యాక్టివిస్టులు, మహిళా యాక్టివిస్టులు మరియు రైతులు మూవీ స్టాల్‌ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. రైతుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు.

ప్రపంచమంతా స్మార్ట్ ఫార్మింగ్ వైపు సాగుతున్న ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక సాంకేతికతలను సంప్రదాయ వ్యవసాయ జ్ఞానంతో కలిపి భవిష్యత్తులో వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందవచ్చో ఈ చిత్రంలో చూపించారు. వ్యవసాయం మరియు సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చిత్రబృందం చెబుతోంది. వ్యవసాయంతో పాటు, ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. మునుపటి తరాలు జంటలకు మార్గనిర్దేశం చేయడంలో, కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తుచేస్తుంది.

కాగా సందేశాత్మక అంశాలను ప్రస్తావించినప్పటికీ, ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది. దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్‌తో ఈ సినిమా నవ్వులు పంచేలా రూపొందించబడింది. యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+