అక్రమ సంబంధాలు మా ఫ్యామిలీలో కూడా ఉన్నాయ్.. హీరోయిన్ సంచలనం
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు.
తాజాగా ఓ హీరోయిన్ ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు కామన్ అని చెబుతూనే తన భర్త కూడా ఎఫైర్ పెట్టుకున్నాడనే విషయాన్ని బయటపెట్టింది. 1960, 70 దశకాల్లో బాలీవుడ్‌ను ఏలిన అందాల నటి ముంతాజ్, తన కెరీర్‌లో పీక్స్ చూశారు. అప్పట్లో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అయితే, వృత్తిపరంగా ఎంతటి విజయాన్ని సాధించినా, వ్యక్తిగత జీవితంలో ఆమెకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. 1974లో వ్యాపారవేత్త మయూర్ మద్వానీని వివాహం చేసుకున్న ముంతాజ్, వైవాహిక బంధంలో ఒక కఠినమైన దశను చవిచూశారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంతాజ్ తన జీవితంలో ఎదురైన "రఫ్ ప్యాచ్" గురించి నిర్మొహమాటంగా మాట్లాడారు. ఆమె భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన ఆమెకు ఎంతో బాధను కలిగించినప్పటికీ, కేవలం డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా అని వివాహ బంధాన్ని తెంచుకోవాలని ఆమె అనుకోలేదు.
ముంతాజ్ తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికే నిశ్చయించుకున్నారు. జరిగిన తప్పును ఒక్కసారి జరిగిన పొరపాటుగా భావించి, ఆమె భర్తను క్షమించారు. ఈ నిర్ణయానికి ఆమె భర్త మయూర్ కూడా అంతే స్థాయిలో సహకరించారు. ఆయన తన తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాపం చెందారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పటడుగులు వేయబోనని, తమ బంధానికి నిబద్ధతతో ఉంటానని ముంతాజ్‌కు హామీ ఇచ్చారు.
ముంతాజ్ మాట్లాడుతూ, వివాహం అనేది ఒక దీర్ఘకాలిక బంధమని, ఇందులో కొన్ని సవాళ్లు ఎదురవడం సహజమేనని అన్నారు. ఆ మాత్రానికే విడిపోవడం సరికాదని ఆమె సూచించారు. కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి, బంధాన్ని కాపాడుకోవాలని ఆమె సందేశం ఇచ్చారు. ముంతాజ్ జీవితం, ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి ఒక పాఠం అని చెప్పవచ్చు.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications