నాగ చైతన్య రెండో భార్యగా ఆ హీరోయిన్..?
సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారో అనే దానిపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పష్టత లేదు.సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. అటు నాగ చైతన్య కూడా సింగిల్‌గానే ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్య కారణంగా సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు. అటు నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సినిమా షూటింగ్‌లకు గ్యాప్ దొరకడంతో నాగ చైతన్య సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేశాడు. వెకేషన్‌కు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ..ఆ ఫొటోని హీరోయిన్ శోభిత ధూళిపాళ లైక్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. శోభిత ధూళిపాళ, నాగ చైతన్యల మధ్య ఎఫైర్ ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. శోభిత ధూళిపాళ కారణంగానే సమంత నాగ చైతన్యకు విడాకులిచ్చిందనే రూమర్ ఇండస్ట్రీలో ఉంది. సమంతతో విడాకులు అనంతరం శోభిత ధూళిపాళతో కలిసి నాగ చైతన్య విదేశాల్లో దర్శనం ఇచ్చాడు.
దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు నాగ చైతన్య ఫొటోను శోభిత లైక్ చేయడంతో మరోసారి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. శోభితతో నాగ చైతన్య రిలేషన్‌లో ఉన్నాడన్న వార్తలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చినట్లు అయింది. నాగచైతన్య వెకేషన్‌కు శోభితను కూడా తీసుకెళ్లాడని ఆమె పక్కనే ఉండొచ్చనే నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నాగ చైతన్య రెండో భార్యగా శోభిత ధూళిపాళను చూడవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరీ దీనిపై నాగ చైతన్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications