ఆ హీరోయిన్‌పై చిరంజీవి, నాగార్జున షాకింగ్ కామెంట్స్.. అలా అంటూ !
నేషనల్ క్రష్‌గా పేరు పొందింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస హిట్స్‌తో శరవేగంగా దూసుకుపోతున్నది. నాగశౌర్యతో చేసిన 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా తన క్రేజ్‌ను పెంచుకుంది.
బాలీవుడ్‌లోనూ విజయ పథం..
సౌత్‌లో మాదిరిగా బాలీవుడ్ లోనూ రష్మిక తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. రణబీర్ కపూర్ సరసన నటించిన 'యానిమల్' మరియు వైష్ణవ్ యుద్ధాల నేపథ్యంలోని 'ఛావా' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించింది.

'కుబేర' బ్లాక్‌బస్టర్ టాక్..
ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'కుబేర' సినిమాలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా.. రష్మిక కీలక పాత్రలో నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇటీవలే విజయవంతంగా నిలిచింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయనకు శ్రీదేవి.. ఈయనకు సౌందర్య..
ఈ ఈవెంట్‌లో మొదటగా మాట్లాడిన నాగార్జున.. "శేఖర్ కమ్ముల నాకు ఇచ్చిన పాత్ర చాలా విభిన్నంగా అనిపించింది. మొదట్లో డౌట్‌గా అనిపించినా, ఫలితంగా ప్రేక్షకులు మెచ్చినప్పుడు నిజంగా సంతృప్తి కలిగింది అన్నారు. రష్మిక గురించి మాట్లాడుతూ.. తను నేషనల్ క్రష్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. ఈ సినిమాలో నిన్ను చూస్తుంటే 'క్షణక్షణం'లో శ్రీదేవిలా కనిపించావు అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రష్మిక ఆనందంతో మురిసిపోయింది.
"KUBERAA #Sekharkammula's Film and Maa Andhari Film"
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) June 22, 2025
Watch our "Deepak" aka KING @iamnagarjuna Speech #KUBERAA Blockbuster Success Meet! 🤩
▶️ https://t.co/MESwSUNDNK
Event By @shreyasgroup✌️#KuberaaBlockbusterSuccessMeet #KuberaaInCinemasNow pic.twitter.com/r0iLHIH9X1
అలానే ఆ తర్వాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సైతం రష్మికపై ప్రశంసలు కురిపించారు. "నాగ్ అన్న చెప్పాల్సినదంతా చెప్పేశాడు, అయినా నేను ఓ మాట చెబుతా - నువ్వు నేషనల్ క్రష్ కాదు, నా క్రష్ కూడా! నీ మొదటి సినిమా ఈవెంట్‌కు కూడా నేను గెస్ట్‌గా వచ్చాను. అప్పటి నుంచి నీ పెర్ఫార్మెన్స్ చూస్తున్నా. సినిమాకొక పాత్రగా నీవు మారుతున్న తీరు చూస్తుంటే గొప్పగా ఉంది," అని అన్నారు. కుబేరలో నీ పాత్రను చూసినప్పుడు, మొదట రాజు అనే కుర్రాడి చేతిలో మోసపోయిన సన్నివేశంలో నీవు 'సౌందర్య'లా కనిపించావు. క్లైమాక్స్‌లో పసిబిడ్డను పట్టుకున్నప్పుడు నీ కళ్ల అభినయం అద్భుతం. నువ్వు కళ్లతోనే యాక్ట్ చేస్తావ్ రష్మిక. నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ క్రష్!" అంటూ ప్రశంసించారు.
Watch our Megastar @KChiruTweets garu Speech #KUBERAA Blockbuster Success Meet! 🤩
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) June 22, 2025
▶️ https://t.co/3v7shvTcHk
Event By @shreyasgroup✌️#KuberaaBlockbusterSuccessMeet #KuberaaInCinemasNow pic.twitter.com/3wpRq7vCHp
ఇద్దరు సీనియర్ స్టార్లు తనపై ప్రశంసలు కురిపించడం పట్ల ఈ భామ ఫుల్ హ్యాప్పీ అయ్యింది. ఇలాంటి గొప్ప స్టార్ల పక్కన నిలబడి, ఇలాంటి మాటలు వినడం నాకు గర్వంగా ఉంది," అంటూ చెప్పుకొచ్చింది.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications