నందమూరి బాలకృష్ణ అరుదైన రికార్డు

నందమూరి బాలకృష్ణ పేరుమీద తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక అరుదైన రికార్డు ఉంది. సాధారణంగా ఒక హీరో నటించిన చిత్రం ఏడాదికి ఒకటి విడుదలైతేనే ప్రస్తుతం అదే పెద్ద విచిత్రంగా ఉంటోంది. అలాంటిది ఒకేరోజు రెండు సినిమాలు విడుదల చేయడమే కాకుండా ఒకటి యావరేజ్ టాక్, మరొకటి హిట్ టాక్ తెచ్చుకొని రెండు సినిమాలు శతదినోత్సవం జరుపుకోవడం మరో విశేషం.

రెండూ శతదినోత్సవం : ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య నటించిన యాక్షన్ డ్రామా నిప్పురవ్వ. ఈ సినిమా ఎక్కువ కాలం నిర్మాణం జరుపుకుంది. 1993 సెప్టెంబరు 3వ తేదీన విడుదలైంది. అదేరోజు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బాలయ్య నటించిన మరో చిత్రం బంగారు బుల్లోడు కూడా రిలీజైంది. అనూహ్య పరిస్థితుల మధ్య దీన్ని కూడా అదేరోజు విడుదల చేయాల్సి వచ్చింది. రెండు సినిమాలు మ్యూజికల్ గా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హిట్ టాక్ తెచ్చుకున్న బంగారు బుల్లోడు, యావరేట్ టాక్ తెచ్చుకున్న నిప్పురవ్వ.. రెండూ శతదినోత్సవం జరుపుకున్నాయి.

nandamuri balakrishna rare record

30 ఏళ్ల కిందట అరుదైన రికార్డు : తనకు హిట్ పెయిర్ గా నిలిచిన విజయశాంతితో బాలకృష్ణ నటించిన చివరి చిత్రం నిప్పురవ్వు. బంగారు బుల్లోడులో రమ్యకృష్ణ, రవీనా టాండన్ కాంబినేషన్. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీత అందించారు. నిప్పురవ్వకు బప్పీలహరి, రాజ్ కోటి (రండి కదలిరండి పాట), ఎ.ఆర్. రెహమాన్ (నేపథ్య సంగీతం) మ్యూజిక్ డైరెక్టర్స్ గా పనిచేశారు. యువరత్న ఆర్ట్స్ పతాకంపై ఎం.వి. శ్రీనివాస ప్రసాద్ నిప్పురవ్వను నిర్మించగా.. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వీబీ రాజేంద్ర ప్రసాద్ బంగారు బుల్లోడును నిర్మించారు. సరిగ్గా 30 సంవత్సరాల కిందట బాలకృష్ణ క్రియేట్ చేసిన ఈ రేర్ రికార్డుని తరువాత కాలంలో మరే తెలుగు హీరో శతదినోత్సవం కోణంలో బీట్ చేయలేకపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+