నందమూరి మోక్షజ్ఞ హీరోయిన్ వేటలో బిగ్ ట్విస్ట్..!
నందమూరి నటసింహం బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రం సినీ ప్రియుల్లోనూ, నందమూరి అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టుకు సంబంధించిన హీరోయిన్ ఎంపిక విషయంలో చిత్రబృందం ఇంకా ఓ స్పష్టతకు రాలేకపోతోంది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్గా సీనియర్ నటుడు శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధ మేకా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ వార్తలకు తెరపడింది.
ముందస్తు నిర్మాణ జాప్యమే కారణమా?
మోక్షజ్ఞ అరంగేట్ర ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయం కంటే ఎక్కువ ఆలస్యం అవుతుండటంతోనే మేధ మేకా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి చెప్తూ.. మేధ తన సినీ ప్రయాణాన్ని మరో ప్రాజెక్టుతో ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

'మైత్రీ ఇన్ లవ్' తో మేధ ఎంట్రీ
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నూతన డైరెక్టర్ పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ కామెడీ సినిమా 'మైత్రీ ఇన్ లవ్' ద్వారా మేధ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నూతన నటుడు జై జస్తి సరసన ఆమె కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవల హైదరాబాద్లో వైభవంగా జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
మళ్లీ మొదటికొచ్చిన హీరోయిన్ వేట
మేధ మేకా వేరే చిత్రంతో పరిచయం అవుతుండటంతో మోక్షజ్ఞ నిరసన నటించే హీరోయిన్ వేట మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటివరకు మేకర్స్ ఈ ప్రాజెక్టు కోసం ఏ హీరోయిన్ పేరును అధికారికంగా ప్రకటించలేదు. అయితే నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకు మరింత స్టార్డమ్, క్రేజ్ తీసుకురావడం కోసం అగ్రహీరోయిన్లలో ఒకరైన శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం 'విశ్వంభర' విడుదలకు సిద్ధమవుతున్న వేళ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించనున్న మోక్షజ్ఞ తొలి సినిమాలో చివరికి ఏ భామ ఛాన్స్ కొట్టేస్తుందో వేచి చూడాల్సిందే.














Click it and Unblock the Notifications
