ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ హిట్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

తెలుగు, మలయాళం అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంతో పాటు తెలుగులోనూ అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా తెలుగులో సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామాగా గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌ బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా సాత్విక వీరవల్లి నటిస్తోంది.

మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా ఇటీవల వచ్చిన 'ఐ యామ్ గేమ్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, సంయుక్తి విశ్వనాథన్, వినయ ఫోర్ట్, కథిర్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. గతంలో ఆర్డీఎక్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు నహాస్ హిదాయత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ముఖ్యంగా గ్యాంబ్లింగ్, ఫాంటసీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌ తో రూపొందింది.

DulquerSalmaan latest movie news I Am Game heads to OTT streaming on JioHotstar from November 6

అలగే ఐ యామ్ గేమ్ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటన, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఇక ఐ యామ్ గేమ్ మూవీ సెప్టెంబర్ 3 న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నవంబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం అయిన జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా వెల్లడించింది. ఈ క్రమంలో థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా ఈ మూవీని చూసేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+