మిమ్మల్ని హగ్ చేయాలనే వచ్చా.. కానీ : హీరోయిన్ పై నరేష్ హాట్ కామెంట్స్..!
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ అప్పట్లో హీరోగా రాణించి.. ఇప్పుడు సినిమాల్లో ప్రముఖ పాత్రలతో మెప్పిస్తున్నారు. దాదాపు ప్రతి పెద్ద సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తూ తనదైన శైలిలో వినోదాన్ని పంచుతున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన నారీనారీ నడుమ మురారీ చిత్రంలోనూ హాస్యాన్ని పండించారు నరేష్. అయితే ఎప్పుడూ వివాదాలకు దూరంగా నరేష్ తాజాగా హీరోయిన్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నరేష్.. అక్కడే స్టేజీపై ఉన్న హీరోయిన్లను ఉద్దేశించి.. మిమ్మల్ని హగ్ చేసుకోవడానికే వచ్చానంటూ.. వారిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నరేష్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఎలాంటి క్యారెక్టర్ అయినా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగే సత్తా ఉన్న నటుల్లో నరేష్ ఒకరు. అటు ఎమోషన్ అయినా హాస్యం అయినా ఆయన చాలా అలవోకగా పండిస్తుంటారు. తన వయసుకు తగ్గ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా హీరోయిన్లను ఉద్దేశించి నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన 'హే భగవాన్' చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు నరేష్ హాజరయ్యారు. అయితే ఇవాళ హగ్ డే కావడంతో స్టేజ్ మీద ఉన్న పురుషులందరినీ హగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ శివానీ నగరం, యాంకర్ స్రవంతి దగ్గరకు వచ్చేసరికి నరేష్ ఆగిపోయారు.'మిమ్మల్ని కూడా హగ్ చేద్దామనే వచ్చాను. కానీ, మీరిద్దరూ లక్షణంగా చీరలు కట్టుకొని వచ్చారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల తర్వాత చాలామంది స్టేజుల మీద చీరలు కట్టుకునే కనిపిస్తున్నారు' అని నరేష్ అన్నారు.

అంతేకాక భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు ఆడవాళ్లను హగ్ చేసుకోకూడదని అన్నారు. హగ్ డే రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టారని.. అదే కిస్ డే రోజు పెట్టుంటే బాగుండేదని తనదైన శైలిలో పంచ్ లు వేశారు నరేష్. ఇక టాలీవుడ్ నటుడు శివాజీ.. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల వేషధారణపై చేసిన కామెంట్స్ అప్పట్లో చిత్ర సీమలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇదే అంశంలో శివాజీపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications