ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రష్మిక ఆ వీడియో
ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రష్మికతోపాటు ఎంతోమందివి డీప్ ఫేక్ అయి వైరలయ్యాయి. రష్మిక వీడియో అయితే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇటువంటి వీడియోలను సృష్టిస్తున్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది మాత్రం మారడంలేదు. తాజాగా మరోసారి రష్మిక డీప్ ఫేక్ బారిన పడింది. ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో హల్‌చల్ చేస్తోంది. దీనిపై రష్మిక అభిమానులు మండిపడుతున్నారు.
డానియెలా విల్లరియల్ వీడియో
రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒరిజినల్ గా కొలంబియా మోడల్ అయిన డానియెలా విల్లరియల్ కి చెందింది. ఈమె ఓ జలపాతం దగ్గర బికినీలో ఓ రీల్ చేస్తే అది వైరలైంది. ఇదే రీల్ ను ఎడిట్ చేసి వీడియోను సృష్టించారు. రష్మిక ముఖం వచ్చేలా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై నేషనల్ క్రష్ స్పందించాల్సి ఉంది. గతేడాది నవంబరులో రష్మికదే ఒక ఫేక్ వీడియో వైరలైంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆలియా భట్, కత్రినా కైఫ్, కాజోల్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్స్ సైతం ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు.

జాగ్రత్తగా కథల ఎంపిక
దక్షిణ భారతదేశం నుంచి హీరోయిన్ గా ఉంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారారు రష్మిక. నేషనల్ క్రష్ అనే బిరుదును సంపాదించుకున్నారు. రష్మిక చేస్తున్న సినిమాలన్నీ దాదాపుగా హిట్ అవుతుండటంతో గెల్డెన్ లెగ్ అనే పేరు పడిపోయింది. జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తున్నారు. జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన యానిమల్, పుష్ప సినిమాల్లో కూడా హీరోయిన్ ఈమే. పుష్ప2లో నటిస్తోంది. సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని, త్వరలోనే వివాహం చేసుకుంటారనే వార్త మాత్రం ఎప్పటినుంచో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications