రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
దక్షిణ భారతదేశం నుంచి హీరోయిన్ గా ఉంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారినవారు ఎవరైనా ఉన్నారా? అంటే రష్మిక అనే సమాధానం ఠక్కున వస్తుంది. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. రష్మిక ఏదైనా సినిమా ఒప్పుకుంది అంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం రోజురోజుకూ బలపడుతోంది. ఛలో సినిమా ద్వారా కన్నడ పరిశ్రమ నుంచి తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన రష్మిక అన్ని భాషల్లో నటిస్తున్న ఏకైక నటి కావడం గమనార్హం.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటోంది. వాస్తవానికి తను నిర్మాత, దర్శకులను దృష్టిలో పెట్టుకొని కథ నచ్చితే పారితోషికం కూడా తగ్గించి తీసుకుంటుంది. పాన్ ఇండియా హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఇతర హీరోయిన్ల కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. తాజాగా తెలుగులో ఓ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రూ.4 కోట్లు అడుగుతోందని సమాచారం. అయితే చిత్ర బడ్జెట్ తక్కువ అని, అందుకనుగుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిర్మాత, దర్శకులు కోరినట్లు సమాచారం.

తన తాజా చిత్రం యూనిమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ వచ్చిన ఆఫర్లను ఒప్పుకోకుండా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, పుష్ప2 సినిమాలు చేస్తోంది. సినిమాలతోపాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తోంది. తద్వారా భారీగానే ఆదాయాన్ని కూడగడుతోందంటున్నారు. గత సంవత్సరం వచ్చిన ఒక నివేదిక ప్రకారం రష్మిక నెలకు రూ.70 లక్షలు సంపాదిస్తోంది. అది కాకుండా సినిమా ఒప్పుకుంటే రూ.3 నుంచి రూ.4 కోట్ల మధ్యలో తీసుకుంటోంది. ఇప్పటివరకు రష్మిక ఆస్తుల విలువ రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్యలో ఉంటుందంటున్నారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications