యాంకర్ రష్మిని చెప్పుతో కొడతానన్న నెటిజన్..రిప్లై అదిరింది
బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి.
వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది.

జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై రష్మి స్పందించింది. అందులో ఓ వ్యక్తి గన్ను పట్టుకుని ఆవును షూట్ చేస్తూ ఉంటాడు. దీనిపై రష్మి స్పందిస్తూ..హిందువులు ఇలాంటివి జరగనివ్వకుండా చూడాల్సింది..ఇదంతా మన తప్పు వల్లే ఒక ఆవు ప్రాణాలు కోల్పోయింది అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ స్పందించాడు. ఎవర్తి రా ఇది అక్కడ ఆడవారిని బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగిస్తూ రేప్ చేసి చంపేస్తున్నారు.
చిన్న పిల్లలను కూడా వదలకుండా చంపేస్తుంటే అడగకుండా ఒక ఆవును చంపేస్తే అడుగుతుంది. చిన్న పిల్లలను చంపేస్తుంటే రెస్పాండ్ అవ్వదు ఈమెను ఏ చెప్పుతో కొట్టాలి అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఆ నెటిజన్ చేసిన కామెంట్స్‌పై రష్మి రియాక్ట్ అవుతూ..బ్రెయిన్ వాడండి ఈ రోజు ఆవులు, ఎద్దులు, కాకులే రేపు మీ పిల్లలు. ఒక్కసారి మనిషి చంపడానికి సిద్ధం అయితే వాడికి మనుషులకు పశువులకి తేడా ఏమి కనిపించదు. అక్కడ ఏ ధర్మం పనికి రాదు అంటూ ఆ నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రష్మి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా!











Click it and Unblock the Notifications