దెబ్బ మీద దెబ్బ.. హాట్ బ్యూటీ "నిధి అగర్వాల్" కి ఎన్ని కష్టాలో..!
నిధి అగర్వాల్.. ఈ హాట్ బ్యూటీకి సౌత్ ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో తనదైన శైలిలో రాణిస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ ముద్దుగుమ్మకి బ్యాడ్ టైం వెంటాడుతుందా అనే అనుమానాలు ఆమె అభిమానుల్ని కలవరపెడుతున్నాయి. "సవ్యసాచి" సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో చేసిన 'మిస్టర్ మజ్ను' తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించకపోయినా రామ్ పోతినేనితో చేసిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ ఒక్క హిట్తోనే ఆమె టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించింది. తరువాత తక్కువ చిత్రాల్లో నటించినా.. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది.

కాగా 2022 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నిధి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కోసం ఐదు సంవత్సరాలు టైం కేటాయించడంతో పాటు ప్రమోషన్లను తన భుజానపై మోసుకున్నా కానీ అమ్మడికి ఉపయోగం మాత్రం శూన్యం అనే చెప్పాలి. గ్లామర్ ట్రీట్ ఇచ్చినా వయ్యారాలు ఒలకపోసినా సినిమా బోల్తా కొట్టడంతో ఆమెకు మైనస్ అయ్యింది.
ఇవి పక్కన పెడితే కాస్త రూట్ మార్చి హీరోయిన్స్ ఐటమ్ భామలుగా అదరగొడుతున్న తరుణంలో.. మిరాయ్‌లో నిధి స్పెషల్ సాంగ్‌కు స్పెప్పులేసింది. యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా.. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఇందులో విలన్ గా మంచు మనోజ్ నటించగా.. యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా చేసింది. సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ తో పాటు.. జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.
భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా మొదటి రోజే రూ.27 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

కానీ సినిమా లెంత్, ఫ్లో మిస్, కథలో ఇరికించినట్లుగా ఉంటుందని నిధి ఐటం సాంగ్ ను ఎడిటింగ్ లో తీసేసారు మేకర్స్. అంతే కాకుండా వైబ్ ఉంది సాంగ్ కూడా కట్ చేసేశారు. దీంతో సినిమాల విషయంలోనే కాకుండా ఐటం సాంగ్ మ్యాటర్ కూడా ఇలా బెడిసి కొట్టిందని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీంతో ఈ అమ్మడు ఆశలు అన్నీ ఇప్పుడు ప్రభాస్ "రాజా సాబ్" మీదే ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మూవీ కోసం కూడా దాదాపు మూడేళ్ల నుంచి కష్టపడుతోంది నిధి అగర్వాల్. మరి డార్లింగ్ అయిన ఈ బ్యూటీకి హిట్ ఇస్తాడేమో చూడాలి.












Click it and Unblock the Notifications