నిహారిక రెండో పెళ్లి.. వరుడు అతడేనా..?

మెగా డాటర్ నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో నిహారిక ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గ్రామంలోని 11 మంది కుర్రాళ్లకు ,సర్పంచ్‌కు మధ్య జరిగే కథగా ''కమిటీ కుర్రాళ్లు'' తెరెక్కించాడు దర్శకుడు.

గ్రామీణ రాజకీయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భతంగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు.మరోవైపు ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు. కమిటీ కుర్రోళ్ళు' గురించి గ్రేట్ థింగ్స్ వింటున్నా. నీ డెబ్యూ ప్రొడక్షన్ సక్సెస్ పై కంగ్రాట్స్ నిహారిక. టోటల్ టీంకు కూడా శుభాకాంక్షలు. త్వరలో సినిమా చూస్తానంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు.

niharika 2nd marriage news goes viral

ఇదే జోష్‌లో తన రెండో పెళ్లి గురించి కూడా నిహారిక ప్రకటన చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. జోన్నలగడ్డ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న నిహారిక, అతనితో ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో నిహారిక మాట్లాడుతూ..మంచి పర్సన్ దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక రెండో పెళ్లికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తితో నిహారిక పెళ్లి జరగనుందని సమాచారం. ఇప్పటికే ఇరు కుంటుబీకుల మధ్య పెళ్లి గురించి చర్చలు అయిపోయాయని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివర్లో మెగా ఇంట్లో పెళ్లి భాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇది కేవలం ప్రచారమే అని మెగా అభిమానులు కొట్టి పారేస్తున్నారు. నిహారిక ప్రస్తుతం తన కెరీర్ మీద దృష్టి సారించారని, పెళ్లి గురించి ఆమె ఆలోచన చేయడం లేదని వారు చెబుతున్నారు.మరి నిహారిక పెళ్లి వార్తలపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+