పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విశ్వక్ సేన్ హీరోయిన్
హీరోయిన్ నివేదా పేతురాజ్ తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ముఖ్యంగా విశ్వక్ సేన్ నటించిన పాగల్, దాస్ కా ధమ్కీ , బూ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు, తమిళ కన్నడ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా నివేదా పేతురాజ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#NivethaPethuraj doing a remake of Soppana Sundari?? pic.twitter.com/rc00z3fcTT
— Movies4u (@Movies4uOfficl) May 30, 2024
కారులో వెళుతున్న నివేదా పేతురాజ్‌ను పోలీసులు ఆపి మేడం.. ఎలక్షన్ కోడ్ నడుస్తోంది కాబట్టి చెకింగ్‌లో భాగంగా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే నివేదా తన కారు డిక్కీ ఓపెన్ చేయడానికి అంగీకరించలేదు.కాసేపు పోలీసులతో వాగ్వాదం చేశారామె. "రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే చూపిస్తాను. చెక్ చేసుకోండి" అని నివేదా పేతురాజ్ బదులిస్తుంది.అయినా పోలీసులు అవేం వద్దు ట్రంక్ (కారు డిక్కీ) ఓపెన్ చేయండి మేడమ్ అని గట్టిగా వారించారు. దానికి "అర్థం చేసుకోండి. ఇది మా కుటుంబ పరువుకు సంబంధించినది.

డిక్కీలో ఏం లేవు. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు" అని నివేదా పేతురాజ్ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇంతలో రికార్డ్ అవుతున్న కెమెరావైపు చూస్తూ "ఎందుకు రికార్డ్ చేస్తున్నారు.. ఆపండి" అంటూ కోపంగా కెమెరా తీసేసుకుంది నివేదా పేతురాజ్. అయితే నిజంగానే నివేదా పేతురేజ్ తన డిక్కీలో ఏమైనా తీసుకెళ్తుందా? పోలీసులకు చెకింగ్ కి సహకరించడానికి ఎందుకు భయపడుతుంది అని పలువురు కామెంట్స్ చేస్తుంటే.. ఈ వీడియో చూస్తుంటే ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసినట్లు ఉంది. పోలీస్, నివేదా ఎక్స్‌ప్రెషన్స్ కూడా యాక్టింగ్ చేసినట్టే ఉన్నాయి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications