అతనితో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత..? ప్రియుడితో కలిసి తిరుమల పయనం
గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సమంత ..హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఒంటరికి ఉంటున్నారు.
ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌లో ఓ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.

వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
సరిగ్గా ఇదే సమయంలో సమంత మరోసారి ఆ దర్శకుడితో తరచూ దర్శనం ఇస్తోంది.'ఫ్యామిలీమ్యాన్ సీజన్3' వెబ్ సిరీస్ గురించి మేకర్స్ కీలక ఆప్డేట్ ప్రకటించారు. త్వరలోనే 'ఫ్యామిలీమ్యాన్ సీజన్3' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సందర్భంగా దర్శకుడు రాజు నిడుమోరుతో కలిసి సమంత దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ మధ్య చెన్నై చాంపియన్స్‌కు సపోర్ట్ చేస్తున్న సామ్ వారితో ఫొటో దిగుతూ రాజ్ చేతి పట్టుకుని కనిపించింది. తాజాగా మరోసారి ఈ జంట కలిసి దర్శనం ఇచ్చారు.
సమంత ప్రస్తుతం తెలుగులో శుభం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ 'శుభం' సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్‌ను తీసుకుని సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే సమంతతో పాటు, రాజు నిడుమోరు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో సమంత ఆ దర్శకుడినే రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారంపై సమంతతో పాటు, అటు రాజు నిడుమోరు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications