OG Review: ఇదెక్కడో చూసినట్టుందే.. కానీ చూడలేదు
ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో OG ఒకటి. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా, అంచనాలకు మించి అభిమానులను అలరించింది. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ ఇమేజ్, స్టైల్, మరియు ఎలివేషన్స్ తో నిండిపోయింది. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక ఫ్యాన్ బాయ్ ట్రీట్.
కథ
కథనం ప్రకారం, ఒక రాజుకి (ప్రకాశ్‌రాజ్) అతని యోధుడు (పవన్ కళ్యాణ్) దూరమైపోతాడు. ఈ సమయంలో శత్రువులు రాజ్యంపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఆ కష్టాన్ని చూసి మళ్ళీ యోధుడు తిరిగి వస్తాడు. ఇక్కడ రాజు సత్య దాదా అయితే, యోధుడే ఓజాస్ గంభీర అలియాస్ OG. అతని గతమే ఈ సినిమాకు వెన్నెముక. ఓమి (ఇమ్రాన్ హష్మీ) లాంటి క్రూరమైన శత్రువులను OG ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. జపాన్లోని సమరాయ్ వంశంతో OG కి ఉన్న సంబంధం, ముంబై అండర్ వరల్డ్‌లో అతని ప్రభావం వంటి విషయాలు సినిమా ఆసక్తిని పెంచుతాయి.

సినిమా విశ్లేషణ
సుజీత్ ఈ సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ పవన్ స్టైల్‌ను మరింత పెంచేలా డిజైన్ చేశారు. థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమా ప్రారంభంలో వచ్చే యకుజా, సమరాయ్ కథాంశాలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి ఎలివేషన్స్ హంగామా మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు, ఆ తరువాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి.
అయితే, కొన్ని ఉపకథలు, ప్రేమకథ, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధం లాంటి భావోద్వేగాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ, సినిమాలో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ లోపాలను కప్పిపుచ్చాయి. పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్‌గా, గంభీరంగా కనిపించారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియానాక్ మోహన్, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. రవి కె. చంద్రన్ , మనోజ్ పరమహంస అందించిన విజువల్స్, థమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. మొత్తం మీద, OG ఒక విజువల్ ట్రీట్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులను తప్పకుండా అలరించే చిత్రం. పతాక సన్నివేశాలు "జానీ" సినిమాను గుర్తు చేస్తూ రెండో భాగానికి దారి తీశాయి.
Rating:2.5/5












Click it and Unblock the Notifications