'ఓజీ' ఓటీటీ డీల్ క్లోజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో వచ్చిన 'ఓజీ' మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ గా రూపొందించిన ఈ గ్యాంగ్‌ స్టర్ యాక్షన్ డ్రామా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని చెబుతున్నారు. ఒక్కో సీన్ ఒక్కో ఎలివేషన్ అని టాక్ వినిపిస్తోంది. కేవలం ఈ సినిమా ఫ్యాన్స్​ కు మాత్రమే కాకుండా సినిమా చూసిన ప్రతీ సినీ ప్రేక్షకుడికి కూడా మెప్పించేలా ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ ఒక్కసారిగా పవర్​ ఫుల్​ గ్యాంగ్​ స్టర్​ పాత్రలో చూపించే సరికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆడియన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 'ఓజీ' హవా నడుస్తోంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ కు పాజిటివ్ టాక్ రావడంతో.. ఇవాళ థియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. మొదటి రోజే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ క్రమంలో ఓజీ సినిమా ఓటీటీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ మాధ్యమమైన నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దాదాపు రూ. 92 కోట్లు ఓజీ రైట్స్ అమ్ముడైనట్లు టాక్ నడుస్తోంది. 6 నుంచి 8 వారాల తర్వాత ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే దీపావళి కానుకగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కానున్నట్లు సమాచారం అందుతోంది.

OG s Diwali Dhamaka Netflix Bags Pawan Kalyan Thriller in Record 92 Cr Deal Fans Go Wild Online

ఇక ఈ మూవీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ విలన్‌ గా నటిచాడు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌ గా నటించింది. అలాగే ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, సుధేవ్ నైర్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో మెరిశారు. తమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించాడు. డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్ పై నిర్మించిన ఈ భారీ యాక్షన్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+