గుడ్ న్యూస్: మాల్దీవుల్లో ప్రభాస్ ఎంగేజ్ మెంట్.. ఆమెతోనే?
పాన్ ఇండియా డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ చిత్రంతో భారీ హిట్ కొట్టారు. రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తనను తొక్కిపెట్టాలనుకుంటున్నవారికి గట్టి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం కల్కి సినిమాతోపాటు రాజా సాబ్ చిత్రం చేస్తున్నాడు. కల్కి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ దీన్ని నిర్మిస్తోంది. ఆసియా ఖండంలోనే 24 దేశాల్లో దీన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టాలనే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఇటువంటి హడావిడిలో ఉన్న సమయంలోనే ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ పరంగా దూసుకుపోతున్న ప్రతి సమయంలోను ప్రభాస్ ను ఇలాంటి రూమర్లు వెంటాడుతూనే ఉన్నాయి. అసలు తమ డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ప్రచారం జరిగింది.

తాజాగా మరో హీరోయిన్ ను ఈ జాబితాలోకి తీసుకువచ్చారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన కృతిసనన్ తో మాల్దీవుల్లో ఎంగేజ్ మెంట్ జరగబోతోందనేది ఈ రూమర్ల సారాంశం. దీనిపై డార్లింగ్ అభిమానులు మండిపడుతున్నారు. గాసిప్స్ ప్రచారం చేయడానికి కూడా ఒక హద్దుండాలని, హద్దు పద్దు లేకుండా చేసే ఇటువంటి రూమర్లను ఇకనైనా ఆపాలంటున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ సినిమా వేడుకలో చెప్పాడని, అయినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పదే పదే ప్రభాస్ పెళ్లి ఫలానావారితో జరగబోతోందంటూ ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications