ప్రభాస్ ఇంటిని చూశారా?.. కళ్లు తిరిగి కింద పడతారు!
రెబల్ స్టార్ ప్రభాస్ ను అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే అందరికీ నచ్చిన మంచి మనసు అతని సొంతం. తనవల్ల ఎవరైనా నష్టపోయారు అని తెలిస్తే వారికి సత్వరమే న్యాయం చేసేవరకు నిద్రపోడు. ఆదిపురుష్ చిత్రం కొనుగోలుచేసిన నిర్మాత విశ్వప్రసాద్ ప్రస్తుతం డార్లింగ్ తో రాజా సాబ్ చిత్రం చేస్తున్నారు. ఆదిపురుష్ సమయంలో 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలియడంతో తన పారితోషికంలో వెంటనే రూ.30 కోట్లు తగ్గించుకున్నాడు. నిర్మాత అవసరంలేదని చెప్పినా డార్లింగ్ మాత్రం వినలేదు. అదీ అతని మనసు.
మనసున్న మారాజు ఇంటిని చూశారా?
ఇంతటి గొప్ప మనసున్న మారాజు ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. షూటింగ్ లేని సమయంలో ఎక్కడు ఉంటాడు? ఏం చేస్తుంటాడు? అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియవు. అయితే ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. కల్కితో రూ.1200 కోట్లు వసూలు చేయబోతున్న డార్లింగ్ ఉంటున్న ఇంటిని చూస్తే మాత్రం నిజంగానే కళ్లు తిరిగి కింద పడిపోతారు. ఆ ఇల్లు ముందు ఫలక్ నుమా ప్యాలెస్ కానీ, అమెరికా వైట్ హాస్ కానీ సరిపోవు. ఇంద్రుడు నిర్మించిన భవనంలా ఉంటుంది.

మైసూరు బృందావన్ గార్డెన్స్ కూడా సరిపోదు
ఆ ఇంట్లో టైల్స్ వేసేందుకు వివిధ దేశాల నుంచి వాటిని తెప్పించారు. ఆ ఫ్లోరింగ్ చూస్తే గుక్క తిప్పుకోకుండా ఆశ్చర్యపోతారు. స్విమ్మింగ్ ఫూల్ అయితే అద్దంలా ఉంటుంది. ఎవరైనా స్విమ్మింగ్ ఫూల్ ను బయట ఏర్పాటు చేసుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంటిలోపల రహస్యంగా ఏర్పాటు చేసుకోవడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లోని సీబీఐ కాలనీలో డార్లింగ్ ఇల్లు ఉంది. ఇంటిని మెయింట్‌నెన్స్ చేసేందుకు నెలకు రూ.10 లక్షల పైనే అవుతోంది. ఇంటిబయట గార్డెనింగ్ చూస్తే మైసూరులోని బృందావన్ గార్డెన్స్ కూడా సరిపోదు. గండిపేటలో ఓ గెస్ట్ హౌస్, సొంత ఊళ్లో ఇంటితోపాటు చెన్నై, ముంబయి, బెంగళూరుల్లో వేల కోట్ల రూపాయల విలువచేసే ఇళ్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications