వరుణ్ తేజ్ పెళ్లికి పవన్ కల్యాణ్ ఇచ్చిన గిఫ్ట్!

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సందర్భంగా రానే వచ్చింది. వారందరూ సంతోషపడేలా ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం అతిథుల మధ్య వైభవోపేతంగా జరిగింది. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఓ ఇంటివారయ్యారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇటలీలోనే కనుక వివాహం కూడా అక్కడే చేసుకోవాలనుకున్నారు.. చేసుకున్నారు.

మెగా కుటుంబ సభ్యులు సతీసమేతంగా హాజరవగా, రష్మిక, నాగచైతన్య, సమంతలాంటివారు కూడా హాజరయ్యారు. తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా వివాహం జరగడతో అభిమానులు కూడా ఎంతో ఆనందపడ్డారు. రాజకీయంగా, సినిమాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ సతీసమేతంగా హాజరవడం ఆయన అభిమానులను, మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

pawan kalyan gift for varuntej marriage

వరుణ్ పెళ్లికి పవన్ కల్యాణ్ ఏం గిఫ్ట్ ఇస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. వరుణ్-లావణ్య.. ఇద్దరికీ కార్లు అంటే మహా పిచ్చి. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్తగా వస్తున్న కార్లను కూడా వీరు టెస్ట్ డ్రైవ్ చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కల్యాణ్ వారికి ఓ కొత్తమోడల్ కారు కొన్నిచ్చారు. ఆ కారులో వరుణ్, లావణ్య ఇష్టాఇష్టాలకు అనుగుణంగా కొన్ని ఫీచర్లు రూపొందించి మరీ ఇచ్చాడు. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జనసేన పార్టీతో రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలనే దృఢనిశ్చయాన్ని కనపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆయన హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబును కలిశారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురూ చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+