ఇద్దరూ కలిసి మరో గబ్బర్ సింగ్‌ను వండుతున్నారు
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలకు చిన్న విరామం ఇచ్చారు. ఇదివరకు కొన్ని రోజుల పాటు వారాహి విజయ యాత్రతో తీరిక లేకుండా గడిపిన ఆయన ఇక సినిమాలపై ఫోకస్ పెట్టారు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు.
పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నాయి. ఈ రెండు కూడా హైఓల్టేజ్ యాక్షన్ మూవీస్. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఓజీ సినిమా కొద్ది రోజుల కిందటే ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి యూనిట్ వరుసగా నాలుగు షెడ్యూళ్లను పూర్తి చేసింది. సుమారు 70 శాతం మేర టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది.

రన్ రాజా రన్, సాహో చిత్రాలను తీసిన సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ మూవీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు ఈ సినిమాను. తమిళనటి ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. శ్రీలీల హీరోయిన్. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నేటి నుంచి మళ్లీ సెట్స్‌పైకి వచ్చింది. కొద్ది రోజుల కిందటే పవన్ కల్యాణ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కంటిన్యూస్‌గా షూటింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్‌లో పోస్ట్‌ను చేశారు. గబ్బర్ సింగ్‌ను గుర్తుకు తెస్తోన్నారు పవన్ కల్యాణ్.
2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ కూడా వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమానే కావడం వల్ల దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిందా మూవీ. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం అదే స్టైల్‌లో ఉంటుందని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు పవన్ కల్యాణ్ రగ్డ్ లుక్స్‌లో కనిపిస్తోండటం మరింత హైప్‌ను ఇచ్చినట్టయింది.
-
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications