Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jalsa VS Murari : ఇయర్ ఎండ్ ఫైట్.. బాబులకే బాబు మహేష్ బాబునా ? కళ్యాణ్ బాబునా ??

2025 ఏడాది నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే 2025కు టాటా చెప్పేస్తూ 2026కు స్వాగతం పలికేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సెలబ్రేషన్స్ ని మరింత స్పెషల్ గా మార్చేందుకు పలు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. కాగా తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా పాత సినిమాలను మళ్లీ థియేటర్లలోకి విడుదల చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు కేవలం ప్రత్యేక సందర్భాల్లో (హీరోల పుట్టినరోజులు, సినిమా వార్షికోత్సవాలు) మాత్రమే చేసే ఈ రీ-రిలీజ్‌లు చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త సినిమాల విడుదల మాదిరిగానే పెద్ద ఎత్తున ఇవి కూడా జరుగుతున్నాయి.

కాగా డిసెంబర్ 31న న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా రెండు చిత్రాలు రీ రిలీజ్ అవుతుండగా పోటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ లో టఫ్ ఫైట్ ఉండే ఆ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అవుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు టాప్ ప్లేస్ లో ఉన్న హీరోలు. దీంతో మా హీరో నెంబర్ 1 అంటే.. మా హీరో నెంబర్ 1 అంటూ వారి ఫ్యాన్స్ ఫుల్ రచ్చ చేస్తుంటారు. ఇప్పుడు ఈ పోటీ ఓ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు.

pawan-kalyan-jalsa-and-mahesh-babu-murari-rereleasing-as-2025-year-end-celebrations

జల్సా vs మురారి..

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "జల్సా".. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "మురారి" రీరిలీజ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ రెండు సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. బుక్‌ మై షోలో గత 24 గంటల్లోనే 'జల్సా' 8,000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అలాగే 31,000కు పైగా ఓట్లతో 9.8/10 రేటింగ్ సాధించింది. ఆల్ ఇండియా స్థాయిలో ఇప్పటికే సుమారు రూ.25 లక్షల గ్రాస్ వసూలు చేసినట్టు చెబుతున్నారు.

అలానే "మురారి" చిత్రానికి కూడా 9.7/10 రేటింగ్‌తో.. 5,000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. ఒక్కో షోకు సగటున 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతోందని.. రూ.100 లోపు టికెట్లు అందుబాటులో ఉండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. దీనిని నెటిజన్లు బాక్సాఫీస్ క్లాష్‌గా చెప్పుకుంటుండగా.. ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయి? అని చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్.. త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్‌తో 'జల్సా'కి స్పెషల్ క్రేజ్ ఉంది. అయితే ఆ సినిమా ప్రారంభంలో వినిపించే వాయిస్ ఓవర్‌ను మహేష్ బాబుది కావడం విశేషం. ఇక మురారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి సో స్పెషల్ గా నిలుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+