'OG'పై దారుణంగా ట్రోల్స్..ముందే చూసుకోవాలి కదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వినాయక చవితి పండుగ మరింత ఉత్సాహాన్ని అందించింది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (OG) నుండి పండుగ కానుకగా ఓ అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో, డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా, ముంబైలోని ఒక గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pawan Kalyan s OG Song Suvvi Suvvi Gets Mixed Reactions on Social Media

సంగీత దర్శకుడు తమన్ అందించిన "సువ్వి సువ్వి" అంటూ సాగే ఈ మెలోడీ పాటను కల్యాణ్ చక్రవర్తి రచించగా, శ్రుతి రంజనీ ఆలపించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే, ఈ పాటపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పాట బాగుందని ప్రశంసిస్తుండగా, మరికొందరు పాటలోని ట్యూన్, సాహిత్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్‌కు, ప్రియాంక మోహన్‌కు మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రియాంక మోహన్ పక్కన పవన్ కల్యాణ్‌ను హీరోగా ఊహించుకోలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట నెగిటివ్ టాక్ మూటగట్టకుకుంది.సోషల్ మీడియాలో ఈ పాటకు వ్యతిరేకంగా అనేక పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. మొత్తం మీద ఈ సాంగ్ ప్రమోషన్స్ పరంగా సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+