ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన బుట్టబొమ్మ!!
బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలు ఫ్లాపవుతున్నా మరోవైపు నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. తన బోల్డ్ పోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వరుస విజయాలతో దూసుకువెళుతున్న ఈ అమ్మడు ఇటీవలికాలంలో చతికిలపడింది. ఒకరకంగా ఆమెకు ఇది ఊహించని పరిస్థితి. స్టార్ హీరోల సరసన ప్రస్తుతం ఆఫర్లు రావడంలేదు. ఈ ఏడాదిలో విడుదలైన సినిమాలు రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీకాభాయ్ కిసీకీ జాన్ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఎఫ్ 3 చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఇది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో అమ్మడుకు బ్యాడ్ టైం నడుస్తోందంటున్నారు.

విజయ్ దేవరకొండతో ప్రారంభించిన జనగణమన ఆగిపోయింది. లైగర్ పరాజయం పాలవడంతో జనగణమన నిర్మాతలు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఒక షెడ్యూల్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతానికి అటకెక్కినట్లే. ఇది ఆగిపోవడంవల్ల దాదాపు రూ.5కోట్ల పారితోషికం బుట్టబొమ్మ చేజారినట్లైంది. ప్రస్తుతం అమ్మడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సాయిధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గంజా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది అంటున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికి బోల్డ్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలే ఇంటర్నెట్ ను షేక్ చేయడంతోపాటు వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications