poonam pandey: పూనమ్ పాండే ఆ క్యాన్సర్‌తో మృతి..క్లారిటీ

బాలీవుడ్ నటి, శృంగార తార, poonam pandey మృతి చెందారు. 31 సంవత్సరాల పూనమ్ పాండే cervical cancer తో మరణించినట్టు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్ తో పూనమ్ పాండే మృతి చెందిందని poonampandeyreal అనే instagram ఖాతాలో చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

కొద్దిసేపటి క్రితం పూనమ్ పాండే అధికారిక instagram అకౌంట్లో చేసిన పోస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. 2013లో నషా సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన పూనమ్ పాండే అనేక వివాదాలకు కేరాఫ్ అయ్యారు. ఆమె నేడు మరణించిందని, ఆమె గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారని, దానితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని, ఈరోజు అత్యంత బాధాకరమైనదిగా అభివర్ణిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు పూనమ్ పాండే అభిమానులకు విషాదంగా మారింది.

poonam pandey died with cervical cancer !

పూనమ్ పాండే సినిమాల కంటే ఎక్కువగా తాను చేసే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. గతంలో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియం లోకి వస్తానని ప్రకటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. కొద్దిరోజుల క్రితం పూనమ్ పాండే మాల్దీవుల షూటింగ్ అకస్మాత్తుగా రద్దు చేసుకున్న తర్వాత పూనమ్ పాండేపై వార్తలు హల్చల్ చేశాయి.

ఇక తాజాగా పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందారన్న వార్తను ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్న వేళ, నిన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గర్భాశయ క్యాన్సర్ పై వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తామని ప్రకటించారు. మంత్రి నిర్మలమ్మ ప్రకటన చేసిన 24 గంటలు అయినా కాకముందే పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో తుది శ్వాస విడిచారు.


పూనమ్ పాండే వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె సామ్ బాంబేను వివాహం చేసుకుని కొంతకాలం అతనితో వీడియోలు, ఫోటోలతో హల్చల్ చేశారు. ఇక 2020లో పూనమ్ అతనిపై గృహ హింస ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఆపై అడపా దడపా సినిమాలు చేస్తున్న పూనమ్ పాండే చిన్న వయసులోనే క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారు.

పూనం పాండే మరణ వార్త దావనంలా పాకడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చ అలా జరుగుతూ ఉండగానే పూనం పాండే హఠాత్తుగా ఓ వీడియో రిలీజ్ చేసింది.అందరూ అనుకుంటున్నట్లుగా తాను సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించలేదని.. కావాలనే తన మరణవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఒక సెలబ్రిటీ ఇలాంటి ప్రమాదకరమైన జబ్బుతో మరణించిందనగానే చాలామంది సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చించుకున్నారని పేర్కొంది. ఈ అవగాహన లేకపోతే మహిళలు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారని ఇందుకోసం వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె సూచించారు.

మొత్తానికి పూనం పాండే చేసిన ఈ ప్రాంక్ కొందరికి ఆగ్రహం తెప్పించినప్పటికీ మరికొందరు మాత్రం మహమ్మారిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగి అందరికీ తెలిసేలా చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+