ఓటీటీలోకి 'OG'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ 'ఓజీ' (OG - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఇక ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

సంచలన దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలై, కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సుజిత్... పవన్ కళ్యాణ్‌ను ఆయన ఫ్యాన్స్ కోరుకునే 'వింటేజ్' పవర్ స్టార్ లుక్‌లో చూపించి అభిమానుల అంచనాలను మించిపోయారు.

Power Star Pawan Kalyan s Box Office Storm OG Original Gangster OTT Release Date Confirmed

పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా అరుళ్ మోహన్ నటించగా, తమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద బలంగా నిలిచింది, ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో చూడలేకపోయిన వారికి, మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే వారికి శుభవార్త! 'ఓజీ' సినిమా అక్టోబర్ 23, బుధవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

థియేటర్లను షేక్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఇప్పుడు ఇంట్లోనే హాయిగా చూసే అవకాశం దక్కింది. పవన్ కళ్యాణ్ ఫైట్స్, సుజిత్ టేకింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ కలిసి ఓటీటీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+