నిజంగా ప్రభాస్ వెరీ బ్యాడ్ లక్... చేతులెత్తేసిన 'సలార్'!
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'సలార్'. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీసింహా, శ్రియారెడ్డి తదితరులు నటించారు. దీనికి సీక్వెల్ గా సలార్ 2 శౌర్యాంగ పర్వం తెరకెక్కబోతోంది. దీనికి సంబంధించిన పనులు ఈ ఏడాదే ప్రారంభం కాబోతున్నాయి.
ఈ సినిమా కలెక్షన్ల సునామీనే సృష్టించదని చెప్పవచ్చు. రూ.650 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రరాజం ఫ్లాప్ గానే నిలిచిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అందుకు కారణం బిజినెస్ భారీగా జరిగింది. ఏరియాలవారీగా దీన్ని అత్యంత భారీ ధరలకు అమ్మారు. అందరూ బ్రేక్ ఈవెన్ కు అడుగు దూరంలో నిలిచిపోయారు. ఒకరకంగా ఈ సినిమా ఫ్లాప్ అయినట్లు లెక్క. ఒక్క నైజాం ఏరియాలోనే బ్రేక్ ఈవెన్ సాధించి కొంత లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు అందించింది. మైత్రీమూవీస్ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సలార్ ఇక్కడ లాభాల్లోకి అడుగుపెట్టింది.

అది మినహా సినిమా ఎక్కడా క్లీన్ హిట్ స్టేటస్ అందుకోలేదు. కర్ణాటక, కేరళలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం కూడా ఒక కారణం. సాహో సినిమా హిందీలో హిట్ గా నిలిచింది. 80 శాతం రికవరీని రాబట్టింది. తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కేవలం 40 శాతమే రికవరీ చేయగలిగి డిజాస్టర్ గా మిగిలింది. దీనితర్వాత విడుదలైన ఆదిపురుష్ కూడా 80 శాతాన్ని రికవరీ చేయగలిగిందికానీ హిట్ గా నిలవలేకపోయింది. కేవలం ఈ సినిమాల్లో కంటెంట్ వీక్ గా ఉండటమే కారణం.
దీనితర్వాత యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సలార్ మాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టిందికానీ బ్రేక్ ఈవెన్ కు అడుగు దూరంలో నిలిచి డిస్ట్రిబ్యూటర్లలో నిరాశను మిగిల్చింది. యాక్షన్ తోపాటు ఎమోషన్స్ బాగా పండినట్లైతే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచేదని, ప్రభాస్ దురదృష్టం అంటూ ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. తర్వాత వచ్చే సినిమాలైనా ప్రభాస్ స్థాయిలో హిట్ అవుతాయో లేదో చూడాలి మరి.












Click it and Unblock the Notifications