కూతురుకు పెళ్లి చేయాల్సిన వయస్సులో తల్లి కాబోతుందా..!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. అయితే దీన్ని నెగిటివ్‌గానే ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే చెప్పాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సినీ సెలబ్రిటీల జీవితాల గురించి అయితే ఈ నెగిటివ్ ప్రచారం కాస్తా ఎక్కువగానే కొనసాగుతోంది. తాజాగా సింగర్ సునీతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సింగర్ సునీతకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం సునీత సొంతం. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సునీతకు మంచి గుర్తింపు ఉంది. ఇక సునీత వ్యక్తిగత జీవితానికి వస్తే..వేధింపులకు గురి చేస్తున్నారనే కారణంతో తన మొదటి భర్తకు సునీత విడాకులిచ్చారు. తన మొదటి భర్తతో ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. మొదటి భర్తతో విడిపోయిన తరువాత సునీత కొంతకాలం సింగిల్‌గా జీవించారు.

pregnancy rumours viral on singer Sunitha

ఆ తర్వాత ప్రముఖ వ్యాపారి రామ్ వీరపనేనిను సునీత రెండో వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లిపై సునీత చాలానే విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కోట్లాది రూపాయిలు ఉండటంతోనే సునీత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్నారని చెప్పి ఆమెను దారుణంగా విమర్శించారు.కోట్లాది రూపాయిలు ఉండటంతోనే సునీత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్నారని చెప్పి ఆమెను దారుణంగా విమర్శించారు.అయితే ఈ విమర్శలపై సునీత ఎమోషనల్‌ అవుతూ రియాక్ట్ అవుతూ.. ఒకర్ని ఒకరు అర్థం చేసుకున్న తర్వాతే రామ్ వీరపనేనితో పెళ్లికి అంగీకరించానని సునీత క్లారిటీ ఇచ్చారు. తాజాగా సింగర్ సునీత ప్రెగ్నెంట్ అయ్యారనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మరోసారి తమ నోటికి పని చెప్పారు.

45 ఏళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ ట్రోలర్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కూతురుకు పెళ్లి చేయాల్సిన వయస్సులో తల్లి కాబోతుందంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే ప్రెగ్నెంట్ వార్తలపై సునీత నుంచి ఎటువంటి స్పందన రాలేదు. గతంలో కూడా సునీత ప్రెగ్నెంట్ అయ్యారంటూ వచ్చిన వార్తలను సునీత ఖండించారు. మరి ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వైరల్ కావడంపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+