కొత్తరకం "ప్రేమ" కథ.. ప్రియదర్శి 'ప్రేమంటే' మూవీ రివ్యూ..!

ప్రియదర్శి, ఆనంది జంటగా నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో నటించిన సినిమా "ప్రేమంటే"- థ్రిల్ ప్రాప్తిరస్తు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించారు. పెళ్లి తర్వాత దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపుల్ని థ్రిల్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిపి చూపించామని చెప్పారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈరోజు ( నవంబర్ 21, 2025 ) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ...

రమ్య (ఆనంది) జీవితం సజావుగా కాకుండా కొంచెం సాహసంగా, కొంచెం థ్రిల్లింగ్‌గా సాగాలని కలలు కనే యువతి. మధుసూదన్ అలియాస్ మది (ప్రియదర్శి) తల్లిదండ్రులను చూసుకుంటూ, ఇంటి బాధ్యతలతో బిజీగా ఉండే సహజ స్వభావం గల యువకుడు. ఇద్దరి ఇళ్లలో పెళ్లి సంబంధాలు చూసే పనిలో భాగంగా ఒక పెళ్లి వేడుకలో వీరిద్దరూ కలుసుకుంటారు. మొదటి పరిచయం, ఆ తర్వాత అభిప్రాయాలు కలుసుకోవడం, పెద్దవారి అనుమతితో అన్నీ సహజంగానే కలిసి రావడంతో ఇద్దరి పెళ్లి జరుగుతుంది. కానీ పెళ్లి తర్వాత మొదలవుతోంది అసలు కథ. రమ్య కోరుకున్నది థ్రిల్లింగ్ లైఫ్...
మది జీవితం మాత్రం బాధ్యతలతో నిండినది... ఈ రెండు ప్రపంచాలు ఒకే ఇంట్లో కలిసినప్పుడు వచ్చిన సంఘర్షణలే సినిమా స్టోరీ.

priyadarshi-and-anandi-premante-movie-telugu-review

మూవీ విశ్లేషణ..

పెళ్లి తర్వాత ఒకరిపై మరొకరికి వచ్చే అనుమానాలు ఇవన్నీ మామూలు గానే అనిపించినా.. హనీమూన్ ముగిసిన వెంటనే కథ అసలు స్టోరీ లోకి వెళ్తుంది. మది తరచూ దూరంగా వెళ్లి ఫోన్‌ మాట్లాడటం..
రమ్యలో అనుమానం పెరగటం.. ఇరుగుపొరుగు వారి మాటలు ఆ అనుమానానికి ఆజ్యం పోయడం, పెళ్లిలో దాచిన నిజాలపై జంట మధ్య విభేదాలు రావడం... ఈ సన్నివేశాలు నేటి సామాజిక పరిస్థితులను బలంగా ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుంచి స్టోరీ మరింత థ్రిల్లింగ్‌గా మారుతుంది. ఆ తర్వాత మది వాస్తవంగా ఏం చేస్తాడు? అతని అసలు జీవితం ఏమిటి? అనే ప్రశ్నలకు సినిమా సమాధానం ఇస్తుంది.

కాగా బ్యాంక్ నేపథ్యం లో వచ్చే యాక్షన్-థ్రిల్ బ్లాక్ కథకి కొత్త మలుపు తీసుకువస్తుంది. ఇక్కడే రమ్య కథలో కీలక పాత్ర పోషిస్తూ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. ఇక్కడి సీక్వెన్స్‌ సినిమాను ఒక లెవెల్ పెంచుతుంది. ఇక సెకండాఫ్ - భావోద్వేగాల రోలర్ కోస్టర్ అని చెప్పాలి. ద్వితీయార్థంలో కథ మరింత సీరియస్‌గా మారుతుంది. పెళ్లికి ముందు నిజాలు దాచినందుకు రగడ, జంట విడిపోయే పరిణామం.. రమ్య పుట్టింటి నుండి బయటకొచ్చి తన కలలు సాధించే ప్రయాణం ఆసక్తిగా మారుస్తాయి. ముఖ్యంగా ఆశామేరీ చేధించే కేసు & దానికి జంట మధ్య ఉన్న లింక్.. ఏం జరగబోతుందో ఊహించినా కానీ హృదయాన్ని తాకేలా సాగుతూ ముగుస్తుంది.

నటీనటుల ప్రదర్శన..

ప్రియదర్శి - మది పాత్రలో చెమటోడ్చాడు. సీరియస్ పాత్రల్లోనూ తాను నిలవగలనని మరోసారి రుజువు చేశాడు. భావోద్వేగాలు, గిల్టీ, కేర్ - అన్నింటినీ సహజంగా చేసాడు.

ఆనంది - రమ్యగా బెస్ట్ పెర్ఫార్మెన్స్. క్లాస్ లుక్, ఎమోషనల్ ప్రెజెన్స్, అగ్రెషన్ - రమ్య పాత్రలో ఆమెకి మంచి స్కోప్ దొరికింది. సినిమాకి అర్ధభాగం ఆమె భుజాలపైనే నడుస్తుంది.

సుమ కనకాల - ఆశామేరీగా షోస్టాపర్ అనిపించుకున్నారు. కామెడీ & ఇన్వెస్టిగేషన్ రెండింటినీ సమానంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. సుమ వచ్చిన ప్రతీ సన్నివేశం థియేటర్‌లో పండుగలా ఉంటుంది.

వెన్నెల కిశోర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కామెడీ పండించారు. చాలా కాలం తర్వాత వెన్నెల కిశోర్ స్ట్రాంగ్ రోల్‌లో కనిపించాడు. ఆది-ప్రసాద్ కాంబో కూడా మంచిగా అనిపిస్తుంది.

బలాలు..

ప్రియదర్శి-ఆనంది జంట కెమిస్ట్రీ

రొమాన్స్ + థ్రిల్ + హాస్యాల మిక్స్

సుమ కనకాల & వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్

ఇంటర్వల్ ట్విస్ట్, బ్యాంక్ ఎపిసోడ్

ఎమోషనల్ డెప్త్

బలహీనతలు..

రెండో భాగం కొంత సాగదీతగా అనిపించడం

కొన్ని సన్నివేశాలు ఊహించదగిన విధంగా ఉండటం

థ్రిల్ & ఫ్యామిలీ డ్రామా మధ్య కొన్నిసార్లు టోన్ మిక్స్

రేటింగ్ - 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+