IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. ఆయన సినీ ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ సంచలనాలే కనిపిస్తాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు, విమర్శకుల మనసు గెలుచుకోవడంలోనూ బన్నీ ఎప్పుడూ ముందే ఉంటారు.

అయితే, చిత్రంగా గ్లోబల్ రేటింగ్ ప్లాట్‌ఫామ్ IMDb లెక్కల ప్రకారం ఆయన టాప్ 10 సినిమాల జాబితాను పరిశీలిస్తే.. ₹1700 కోట్లు కొల్లగొట్టిన 'పుష్ప 2'కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.కలెక్షన్లతో సంబంధం లేకుండా, కేవలం కంటెంట్, రేటింగ్ ఆధారంగా నిలిచిన అల్లు అర్జున్ 'టాప్ 10 మూవీస్ ను పరిశీలిస్తే..

Pushpa 2 Misses IMDb s Top 10 Icon star Allu Arjun Movies List Surprising Fans Worldwide

1. వేదం (రేటింగ్ 8.1) - నటుడిగా విశ్వరూపం

బన్నీ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా 'వేదం' నిలిచింది. కేబుల్ రాజు పాత్రలో ఆయన చూపిన నటన, క్లైమాక్స్‌లో పండించిన భావోద్వేగాలు అద్వితీయం. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం కమర్షియల్ లెక్కలను పక్కనపెట్టి సినీ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది.

2. ఆర్య (రేటింగ్ 7.8) - ఒక ట్రెండ్ సెట్టర్

"ఫీల్ మై లవ్" అంటూ సుకుమార్-బన్నీ ద్వయం సృష్టించిన మ్యాజిక్ ఇది. వన్ సైడ్ లవ్ స్టోరీలకు సరికొత్త నిర్వచనం చెబుతూ, అల్లు అర్జున్‌ను యూత్ ఐకాన్‌గా మార్చిన సినిమా.

3. పుష్ప: ది రైజ్ (రేటింగ్ 7.6) - నేషనల్ అవార్డు విన్నర్

తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా. ఈ చిత్రంతోనే బన్నీ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు.

4. ఆర్య 2 (రేటింగ్ 7.5) - సైకో లవర్ పాత్రలో..

ఆర్యలోని సాఫ్ట్ ప్రేమికుడిని పక్కనపెట్టి, కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో బన్నీ ఇరగదీశారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచినా, IMDbలో మాత్రం దీనికి మంచి క్రేజ్ ఉంది.

5. జులాయి (రేటింగ్ 7.3) - ఇద్దరు తెలివైన వారి యుద్ధం

త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, అల్లు అర్జున్ ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో జులాయి నిరూపించింది. కామెడీ, యాక్షన్ మేళవింపుగా వచ్చిన ఈ చిత్రం మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరించింది.

6. రేసుగుర్రం (రేటింగ్ 7.3) - కిక్ ఇచ్చే వినోదం

లక్కీ పాత్రలో బన్నీ చేసిన అల్లరి, శృతి హాసన్‌తో కెమిస్ట్రీ, బ్రహ్మానందం కామెడీ.. ఇవన్నీ కలిసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. బన్నీ డ్యాన్సులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

7. అల వైకుంఠపురములో (రేటింగ్ 7.3) - క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా

సంక్రాంతి బరిలో దిగి నాన్-బాహుబలి రికార్డులను తిరగరాసిన సినిమా. ఇందులోని పాటలు ఫేమస్ అయ్యాయి. బంటు పాత్రలో బన్నీ బాగా నటించాడు.

8. హ్యాపీ (రేటింగ్ 7.1) - పిజ్జా బాయ్ మ్యాజిక్

కరుణాకరన్ మార్క్ ఫీల్ గుడ్ మూవీ. జెనీలియాతో బన్నీ చేసే గొడవలు, ఇన్నోసెంట్ కామెడీ ఇప్పటికీ టీవీల్లో వస్తే అందరూ కళ్లప్పగిస్తారు.

9. పరుగు (రేటింగ్ 7.1) - తండ్రీకూతుళ్ల సెంటిమెంట్

భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక తండ్రి ఆవేదనను, ప్రేమికుడి సంఘర్షణను కళ్లకు కట్టింది. నటుడిగా అల్లు అర్జున్ లోని పరిణతిని ఈ సినిమా చాటిచెప్పింది.

10. సన్నాఫ్ సత్యమూర్తి (రేటింగ్ 7.1) - విలువల విందు

తండ్రి ఆశయాల కోసం పాకులాడే కొడుకు కథ. సెంటిమెంట్ పండించడంలో త్రివిక్రమ్-బన్నీ జోడీ మరోసారి సక్సెస్ అయ్యింది.

బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన 'పుష్ప 2' కేవలం 6.1 రేటింగ్‌తో టాప్ 10 జాబితాకు దూరంగా ఉండటం విశేషం. వసూళ్లు ఎక్కువగా ఉన్నా, విమర్శకుల దృష్టిలో పాత సినిమాల కంటెంట్ బలంగా ఉండటమే దీనికి కారణం కావచ్చు. ఏదేమైనా, ఒక నటుడిగా బన్నీ తన 44వ ఏటలో కూడా కొత్త ప్రయోగాలకు సిద్ధమవ్వడం ఆయన అభిమానులు గర్వించదగ్గ విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+