మందు బాబులకు గుడ్ న్యూస్..ఇకపై సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు

భారతదేశంలో సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలకు సంబంధించి స్పష్టమైన జాతీయ విధానం లేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అందువల్ల, వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు నియమాలు అమల్లో ఉన్నాయి.కొన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలను అనుమతిస్తే, మరికొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అనుమతులు మరియు నిబంధనల ప్రకారం మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి.

ఇటీవల, పీవీఆర్ ఐనాక్స్ వంటి కొన్ని మల్టీప్లెక్స్ చైన్‌లు తమ థియేటర్లలో మద్యం అమ్మకాలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. బెంగళూరు, గుర్గావ్‌లోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో మద్యం అమ్మేందుకు అనుమతి కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదాయం పెంచేందుకూ, అభిమానులకు అద్భుతమైన ప్రీమియర్ అనుభూతిని అందించేందుకూ ఇలాంటి పథకాలు కావాలని, అందుకే ఇలాంటి కొత్త ఐడియాలు ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చామని ఆ సంస్థ తెలిపింది. మొదట్లో కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని అమలు చేయడానికి అనుమతి కోరారు. తద్వారా వచ్చిన ఫలితాలను బట్టి దీని కార్యాచరణపై ఆలోచన చేస్తామని పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం తెలిపింది.

PVR Inox urges government to allow sale of liquor in cinema halls

అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం వల్ల థియేటర్ల ఆదాయం పెరుగుతుందని కొందరు వాదిస్తుండగా, ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని, మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కానీ ఈ పథకం అమలైతే థియేటర్లు మద్యం దుకాణాలుగా మారిపోతాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరి ఈ నిర్ణయంపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+