అప్పటి నుంచి ఆమెతో శారీరకంగా దూరంగా ఉన్నా - హీరో రాజ్ తరుణ్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు వినిపించాయి. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేయడం జరిగింది. హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్టులెక్కింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది.
రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ తనని కేసు వెనక్కి తీసుకోవాలని లేకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications