చెల్లెలు భర్తతో స్టార్ హీరోయిన్ ఎఫైర్ ..ఆ హీరో కూడా వదల్లేదు
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఓ హీరోయిన్ ఏకంగా చెల్లెలు భర్తతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..సింపుల్ కపాడియా.
బాలీవుడ్ ప్రముఖ నటి డింపుల్ కపాడియా సోదరిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సింపుల్ కపాడియా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.సింపుల్ కపాడియా 1977లో "అనోఖీ అదా" చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో ఆమె అప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో కలిసి నటించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ఆమె అద్భుతంగా నటించి మెప్పించారు. ముఖ్యంగా "జమానే కో దిఖానా హై", "చక్రవ్యూహ", "లూటమార్" వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే, 1985లో ఆమె నటనకు వీడ్కోలు పలికారు.

సింపుల్ కపాడియా జీవితంలో రాజేష్ ఖన్నా పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె మొదటి సినిమాలో రాజేష్ ఖన్నా సరసన నటించడం, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అప్పట్లో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాజేష్ ఖన్నా , డింపుల్ కపాడియా వివాహం తర్వాత కూడా రాజేష్ ఖన్నాకు సింపుల్‌తో సంబంధాలు కొనసాగాయని అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఇదే రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా మధ్య విభేదాలకు కారణమైందని చాలామంది భావిస్తారు.
సింపుల్ కపాడియా కారణంగా రాజేష్ ఖన్నా, డింపుల్ వైవాహిక జీవితంలో తీవ్రమైన గొడవలకు కారణమైందని అంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకే రాజేష్ ఖన్నా నుంచి డింపుల్ విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక సింపుల్ కపాడియా సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యాషన్ డిజైనర్‌గా కొత్త కెరీర్ ప్రారంభించారు. ఈ రంగంలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే, 2006లో ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎన్నో సంవత్సరాల పాటు ఈ వ్యాధితో పోరాడిన తర్వాత, ఆమె 2009లో తన 51వ ఏట కన్నుమూశారు. సింపుల్ కపాడియా జీవితం వెండితెర వెలుగుల నుండి ఫ్యాషన్ ప్రపంచంలో మెరిసి, ఆఖరికి తీవ్ర అనారోగ్యంతో ముగియడం అందరినీ కలచివేసింది. ఆమె అకాల మరణం బాలీవుడ్‌కు ఒక తీరని లోటు.












Click it and Unblock the Notifications