కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో రామ్ చరణ్ భేటీ.. ఆంతర్యం అదేనా !
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. కాగా సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరు పర్యటనకు విచ్చేశారు. దాంతో ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు రామ్ చరణ్ ను ఆయనను కలిసినట్టు తెలుస్తోంది.
ఈ భేటీలో రామ్‌చరణ్ ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించగా.. సిద్ధరామయ్య కూడా చెర్రీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు కొంత సమయం పాటు మాట్లాడుకున్నారు.

మూవీ ఘాట్..
మైసూరులో ప్రస్తుతం ఓ భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఏకంగా వెయ్యి మంది డ్యాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే రామ్ చరణ్ అమ్మమ్మ.. అల్లు రామలింగయ్య సతీమణి మరణంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి.. అంతిమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చరణ్. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది.
ಪೆದ್ದಿ ಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿರುವ ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಟ ರಾಮಚರಣ್ ಅವರು ಇಂದು ಮೈಸೂರಿನಲ್ಲಿ ನನ್ನನ್ನು ಭೇಟಿಯಾಗಿ ಕೆಲಹೊತ್ತು ಮಾತುಕತೆ ನಡೆಸಿದರು. pic.twitter.com/wwmYlNOA6N
— Siddaramaiah (@siddaramaiah) August 31, 2025
గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో లో ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ముఖ్యంగా రామ్‌చరణ్ కొట్టే ఐకానిక్ ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. అలానే ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. చరణ్ నటించిన గత చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications