హీరో పక్క ఎక్కాల్సిందే..రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్

నటి రమ్యకృష్ణకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆరిస్టుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది అమ్మడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ డ్రెస్‌ల్లో కనిపించడానికే భయపడే సమయంలో బికినీతో కనిపించి అభిమానులకు రమ్యకృష్ణ గట్టి షాకిచ్చారు. ఇదే సమయంలో యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది.

ఒకానొక దశలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా రమ్యకృష్ణ చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కొత్తతరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో రమ్యకృష్ణ హవా తగ్గిపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవతారం ఎత్తారామె. హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్ల కనిపిస్తూ అలరిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

Ramya Krishnan shocking comments on casting

ఇంకా చెప్పాలంటే రమ్యకృష్ణ కెరీర్ బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి తర్వాత అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. శివగామిగా రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా తమిళంలో స్టార్ హీరోలతో అందరితోనూ రమ్యకృష్ణ నటించారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో రమ్యకృష్ణ తర్వాతే ఎవరైనా. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్య్వూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశారామె.

సినీ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేదని, కెరీర్‌లో ముందుకు సాగాలంటే చాలా త్యాగం చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.దర్శకుడు లేదా హీరో చెప్పినట్లే చేయకపోతే అవకాశాలు రావు. కొన్నిసార్లు వారి కోరికలు తీరాల్సి ఉంటుంది. లేదంటే మన కెరీర్ అక్కడే ఆగిపోతుందని పేర్కొన్నారు. రమ్యకృష్ణ మాటలతో మరోసారి ఇండస్ట్రీలో ఉన్న లైంగిక వేధింపుల గురించి చర్చ సాగుతోంది.ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+