'ఫైర్ స్ట్రోమ్' పాట 'ఓజీ' సినిమాలో లేదా..? గాలి తీసేశారు కదరా..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఈ మూవీ ఒకటి. రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీతో కొంత నిరాశ పడ్డారు మెగా ఫ్యాన్స్. అయితే ఓజీ మూవీతో ఫుష్ జోష్ మూడో లోకి వచ్చారు. ఈ మూవీ సెప్టెంబర్ 25,2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల రిలీజైన 'ఫైర్ స్ట్రోమ్' పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఫీల్ ది ఫైర్ అంటూ సాగుతున్న ఈ పాట ఫుల్ పవర్ఫుల్గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో తమన్ అందించిన మ్యూజిక్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఇక ఈ ఫైర్ స్ట్రోమ్ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా.. ఆయనతోపాటు నజీరుద్దీన్, భరతరాజ్, శింబు, దీపక్ బ్లూ గానం చేశారు. విశ్వ, శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించగా, రాజా కుమారి ఇంగ్లీష్ లిరిక్స్ రాశారు. అయితే ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈ పాటకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ పాట సినిమాలో ఉండదట. ఈ ఫైర్ స్ట్రోమ్ పాటను సినిమాలో కేవలం ఒక థీమ్ మ్యూజిక్ గా వాడుతారని టాక్ వినిపిస్తోంది. మూవీలో ఎక్కడైతే ఎలివేషన్ సీన్స్ వస్తాయో అక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ వస్తూ ఉంటాయని టాక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ లిరికల్ వీడియో సాంగ్ ను ఇప్పటి వరకు హిందీ, తమిళ వెర్షన్స్ లో విడుదల చేయకపోవడం గమనార్హం.

ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుజిత్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సాగాలా తెరకెక్కించారు. ఇందులో పవన్ కల్యాణ్ 'ఓజాస్ గంభీర'అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. సినిమా కథ ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్ల టీజర్, సాంగ్స్ బట్టి అర్థం అవుతోంది. ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.












Click it and Unblock the Notifications