Sahaa Movie Review: హీరోయిన్ గుండు కొట్టించుకుంటుందా..? కొట్టించుకోదా..?

టాలీవుడ్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ కు కొదవే లేదు. నెలకు ఒక్క సినిమా అయినా ఈ జానర్ లో వస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కఫుల్ ఫ్రెండ్లీ, లిటిల్ హార్ట్స్, దీవానా, చెన్నై లవ్ స్టోరీ, రోమాంచకం సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కు ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీస్ బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ లిస్టులో మరో కొత్త లవ్ స్టోరీ వచ్చి చేరింది. అదే సహ(లైఫ్‌ ఆఫ్‌ సంజు) మూవీ. సెప్టెంబర్ 4 ఈ మూవీ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మరి ప్రేక్షకుల్ని మెప్పించిందా..?

సహ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతేకాక హీరో, హీరోయిన్ ఓ అడుగు ముందుకు వేసి మరీ శపథాలు చేశారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సహ మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక మీరందరూ ఒక గొప్ప సినిమా చూశామని బయటకు వస్తారు.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను అమీర్‌ పేట్ సెంటర్‌ లో నిలబడి గుండు కొట్టించుకుంటా.. అని చెప్పింది. అలాగే సహ మూవీ హీరో శివ కుమార్ మాట్లాడుతూ.. సినిమా నచ్చకపోతే నా నంబ‌ర్‌ కు ఫోన్ చేసి తిట్టండంటూ పబ్లిక్ గానే తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

ఇక సహ మూవీకి నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. తేజ వేల్పుచర్ల నిర్మాతగా సుమైరా స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సౌల్ ఫుల్ మ్యూజిక్ అందించారు. సహ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. సంజు(శివ కుమార్) ఓ ప్రభుత్వ ఉద్యోగి. అతను తన గతం చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే సంజు చిన్నప్పటి నుంచి సహ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకు ఎంసెట్ హాల్ టికెట్ తీసుకు రావడం కోసం తన ఎంసెట్ పరీక్షనే వదులుకుంటాడు. ఇక సహ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. సంజు కూడా ఫేక్ ఐడీ కార్డుతో కాలేజీకి వెళ్లి రోజూ ఆమెను కలుస్తుంటాడు.

ఓ సారి సంజు వ్యవహారం కాలేజీ యాజమాన్యానికి తెలుస్తుంది. దాంతో అతడ్ని పోలీసులకు అప్పగించే నేపథ్యంలో సహ ఆ వివాదాన్ని అడ్డుకుంటుంది. అంతేకాక ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత సహ ప్రెగ్నెంట్ అవుతుంది. పుట్టింటి వాళ్లు కూడా సహ కు నెలలు నిండటంతో ఆమెను దగ్గరకు తీసుకుంటారు. అయితే సంజుకు ఉద్యోగం ఉన్నన్ని రోజులు అతడ్ని మహారాజులా చూస్తుంటారు అత్తింటివారు. కానీ ఉద్యోగం పోవడంతో సంజును అందరూ తక్కువ చేసి చూస్తారు. అది సహకు నచ్చదు. సంజు సైతం సహ ఫోన్స్ దూరం పెడ్తాడు. ఈ క్రమంలో గవర్న్ మెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటాడు. ఈ క్రమంలోనే ఓ ఘోరం జరుగుతుంది. ఆ తర్వాత సహ, సంజు జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేదే స్టోరీ..

Sahaa movie review and rating audience Here is the review of Tollywood s latest love story Sahaa

ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే సంజు పాత్రలో శివ కుమార్ బాగా చేశారు. అలాగే సహ పాత్రలో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. లాజిక్ లెస్ సీన్స్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి హీరో, హీరోయిన్లు శపథం చేసినంతగా ఈ సినిమా లేదని చెప్పాలి. ఇక రేటింగ్ 1.75/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+