నేను చేసిన పెద్ద తప్పు అదే, మీరు నన్ను ఫాలో కావోద్దు, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ !
కన్నడ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. నిర్మాతలకు వందల కోట్లు కుమ్మరించిన కేజీఎఫ్ లాంటి సినిమాలను తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కాల్షీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పదేళ్ల క్రితం ప్రశాంత్ నీల్ పరిస్థితి ఇలా లేదు.
కన్నడ హీరో శ్రీమురళి నటించిన ఉగ్రం సినిమా ద్వారా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా శ్యాండిల్ వుడ్ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ కేవలం శ్యాండిల్ వుడ్ లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అకున్నాడు. ఉగ్రం సినిమాను తెరపైకి తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ 4 ఏళ్లు కష్టపడ్డాడు. కానీ అంత కష్టపడి తీసిన ఉగ్రం సినిమాను కొనేందుకు పంపిణిదారులు, నిర్మాతలు, సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రాలేదు.

విడుదలైన 15 రోజుల్లోనే ఉగ్రం సినిమా పైరసీ వచ్చింది. చాలా మంది మొబైల్‌లో ఉగ్రం సినిమా చూసి ఇష్టపడ్డారని ప్రశాంత్ నీల్ ఇప్పటికీ ఆయన బాధను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. నాకు బాగా నచ్చిన కథను, నేను ఎంతో కష్టపడి తీసిన ఉగ్రం సినిమాని మొబైల్ లోనూ, యూట్యూబ్ లోనూ జనాలు చూసి మెచ్చుకున్నారని ప్రశాంత్ నీల్ అంటున్నాడు. థియేటర్ కోసం తీసిన ఉగ్రం సినిమా ఇలా పైరసీకి గురైయ్యిందని ప్రశాంత్ నీల్ విచారం వ్యక్తం చేశాడు.
10ఏళ్ల తరువాత ప్రశాంత్ నీల్ అదే ఉగ్రం కథను సలార్ గా సినిమా తీస్తే ప్రజలు థియేటర్‌లో ఎగబడి చూశారు. తనకు బాగా నచ్చిన ఉగ్రం కథ మీద ఉన్న నమ్మకంతో, ఆ కథను నమ్ముకుని తాను సలార్ గా తీస్తే ఇప్పుడు ఆ సినిమాను ప్రజలు కోరుకుని ఎంతో ఇష్టంతో థియేటర్లలో చూశారని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఇప్పటికే దిమ్మతిరిగిపోయేలా కేజీఎఫ్, కేజీఎఫ్ పార్ట్ 2, సలార్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ గురువు ఎవరు అని ఇప్పటికే చాలా మంది ఆరా తీశారు.
దర్శకత్వంలో, సినిమాలు చేయడంలో ఎలాంటి అనుభవం లేని ప్రశాంత్ నీల్ కేవలం సినిమాలు చూసి సినిమా తీయాలనే పట్టుదలతో శ్యాండిల్ వుడ్ లో అడుగుపెట్టాడు. ఇంత వరకు ఏ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేసిన అనుభవం కూడా ప్రశాంత్ నీల్ కు లేదు. ఏ దర్శకుడి దగ్గరా ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ గా పని చెయ్యలేదు. ఓ చిన్న సినిమా కూడా చేయకుండా కనీసం షార్ట్ ఫిల్మ్ కూడా చెయ్యకుండా ఏకంగా ఉగ్రం సినిమా తీసే సాహసానికి ప్రశాంత్ నీల్ పూనుకున్నాడు.

ఉగ్రం సినిమా విడుదల అయ్యి దశాబ్దాన్ని పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ చిత్ర బృందం కన్నడలో ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. దీని 2వ ఎపిసోడ్ ఇప్పుడు విడుదలైంది. ఉగ్రం చిత్రబృందానికి అభిమానులు కొన్ని ప్రశ్నలు సంధించారు. మీరు ఎలాంటి వారి దగ్గర నేర్చుకోకుండా, ఏ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేయకుండా ఉగ్రం సినిమా తీశారని, ఒక్కసారిగా సినిమాలు తీయడానికి వచ్చే వాళ్లకు మీరు ఏం సమాధానం, సలహాలు ఇస్తారని ప్రశాంత్ నీల్ కు కొందరు ప్రశ్నలు వేశారు.
ఈ ప్రశ్నలకు ప్రశాంత్ నీల్ సమాధానమిచ్చారు. ఉగ్రం సినిమా తియ్యడానికి, ఆ సినిమా విడుదల చెయ్యడానికి తనకు 4 ఏళ్లు పట్టిందని, ఇలా నాలుగు ఏళ్లు సినిమా తియ్యడం తనతో పాటు తన కుటుంబానికి, హీరో శ్రీమురళి కుటుంబానికి పెద్ద టార్చర్ అయ్యిందని ప్రశాంత్ నీల్ గుర్తు చేశారు. కేవలం 6 నెలల్లో తియ్యాల్సిన ఉగ్రం సినిమా తియ్యడానికి తనకు 4 సంవత్సరాలు పట్టిందని, నా ఆలోచనకు ఉహకు అందని పచ్చి నిజం అది అని ప్రశాంత్ నీల్ చెప్పరు.
నాకు ఇది ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఉగ్రం సినిమా పెద్ద సక్సెస్ అని చాలా మంది ట్రాప్ లో పడిపోతారు. ఇలా సినిమా తీయడం చెడు మార్గం అని, ఎలాంటి అనుభవం లేకుండా ఇప్పుడు కొత్తగా సినిమాలు తియ్యాలి అనుకునే వాళ్లకు నేను ఇస్తున్న సలహా అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఉగ్రం సినిమా చాలాసార్లు రీషూట్ చేశామని, తనకు నచ్చినట్లు, ప్రజలు మెచ్చుకునే సినిమా ఎలా తియ్యాలని అని అన్ని తెలుసుకునే సమయానికి ఉగ్రం సినిమా మొదలుపెట్టి రెండు ఏళ్లు గడిచిపోయిందని, తరువాత ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేశామని ప్రశాంత్ నీల్ వివరించారు.
ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, దాన్ని సరిదిద్దాలి, ఏది చేయకూడదో ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం ముఖ్యం అని సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు. ఉగ్రం మొదటి షాట్ తీసినప్పుడు, నాకు చెమటలు పట్టి ఏం చెయ్యాలో తెలీలేదని, తరువాత నేను చాలా చెత్త సినిమా తీస్తున్నానని అనుకున్నానని, అసలు సినిమా ఎలా షూట్ చేయాలో అని తెలుసుకోవడానికి తనకు 2 సంవత్సరాలు పట్టిందని, తరువాతే ఉగ్రం సినిమా పూర్తి అయ్యిందని సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయన్న కలిసిన యూట్యూబ్ చానల్ కు చెప్పాడు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications