నేను ఒంటరిగా లేను.. రిలేషన్‌లోనే ఉన్నా: సమంత

దక్షిణాది బ్యూటీ సమంత ప్రస్తుతం సిటాడెల్ సూపర్ హిట్ హాలీవుడ్ సిరీస్ కు రీమేక్ అయిన హనీబన్నీ చేసింది. ఈనెల ఏడోతేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించగా, రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. స్పై, యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిన ఈ సిరీస్ లో సమంత చేసిన పోరాట దృశ్యాలు చూసి సినీ ప్రియులంతా ఆశ్చర్యపోతున్నారు. హనీబన్నీ సిరీస్ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సమంత ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. జీవితాంతం మీరు ఇలా ఒంటరిగానే మిగిలిపోతారా? అంటూ ప్రశ్న అడిగింది.

రెండో పెళ్లి చేసుకుంటారా?
దీనికి సమంత సమాధానమిస్తూ నో అంది. ప్రస్తుతం మీరు ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా? అని అడగ్గా.. త్వరలో మీరే చూస్తారుగా అంటూ సామ్ బదులిచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో మరో వ్యక్తికి స్థానం లేదని, రెండో వివాహంపై ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. తాజాగా సమంత నుంచి ఊహించనిరీతిలో పైవిధంగా సమాధానం రావడంతో అందరికీ షాక్ తగిలినట్లైంది. కొంతకాలం నుంచి సమంత బాలీవుడ్ కు చెందిన ఓ యువ కథానాయకుడితో ఎంతో సన్నిహితంగా ఉంటోందని, ముంబయి వెళ్లినప్పుడల్లా అతని ఇంట్లోనే ఉంటోందని వార్తలు వస్తున్నాయి.

Samantha comments that she will soon know with whom she is in a relationship

ప్రయివేటు పార్టీలకు వెళుతున్నారు
ఆ యువ హీరోతో కలిసి ప్రయివేటు పార్టీలకు వెళ్లడం, సొంతంగా పార్టీలు చేసుకోవడం జరుగుతోందని తెలుస్తోంది. ఆ యువ హీరో ఎవరనేది నెటిజన్లు శోధిస్తున్నారు. అదే ఇంటర్వ్యూలో యాంకర్ మరో ప్రశ్న అడిగింది. పుష్ప1లో చేసిన ఐటం సాంగ్ దేశాన్ని ఊపేసిందని, అలాగే పుష్ప2లో కూడా ఐటంసాంగ్ మీరే చేస్తున్నారంట అని అడగ్గా.. దానికి సమంత బదులిస్తూ వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని, ఇకనుంచి ఐటం సాంగ్స్ చేసే ఆలోచన లేదని, చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా పెద్ద వార్తగా మారుతోంది. తాను ఏం చేస్తున్నా మీడియాలో విపరీతమైన ప్రచారం లభిస్తోంది. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేస్తోంది. మరో వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకుంది. దీనికి కూడా రాజ్ అండ్ డీకేనే దర్శకులని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+