సమంత మా ఇంటి బంగారం, కోడలు అంటే ఇలా ఉండాలి
టాలీవుడ్ క్వీన్ సమంత రుత్ ప్రభు (Samantha) మళ్లీ వెండితెరపై తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది 'శుభం'లో మెరుపుతీగలా అతిథి పాత్రలో మెరిసిన సామ్, ఈసారి పక్కా యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్యాకేజీతో బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. సమంత తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పతాకంపై స్వయంగా నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మా ఇంటి బంగారం'. ఈ వేసవికి సమంత ఇచ్చే అసలైన ట్రీట్ మే 15న థియేటర్లలోకి రానుంది.
దర్శకురాలు నందిని రెడ్డి, సమంతల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జబర్దస్త్', 'ఓ బేబీ' చిత్రాలు సమంతలోని వైవిధ్యమైన నటిని ఆవిష్కరించాయి. ఇప్పుడు మూడోసారి ఈ సక్సెస్ ఫుల్ కాంబో 'మా ఇంటి బంగారం'తో హ్యాట్రిక్ పై కన్నేసింది. ఈ చిత్రంలో సమంతతో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

Samantha అమాయకపు కోడలు.. అరాచకపు యాక్షన్!
ఇటీవలే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో సమంత రెండు విభిన్న కోణాల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఒకవైపు పద్దతిగా, సాంప్రదాయాలకు విలువ ఇచ్చే ఇంటి కోడలిగా అమాయకంగా కనిపిస్తూనే.. మరోవైపు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం శత్రువుల సింహస్వప్నంలా మారి యాక్షన్ ఇరగదీశారు. 'సమంత అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, యాక్షన్ లోనూ తను పవర్‌హౌస్' అని ఈ సినిమాతో మరోసారి నిరూపించబోతున్నారు.
మే 15న రసవత్తర పోరు: సమంత వర్సెస్ సుమంత్
ఈ వేసవి రేసులో సమంతకు గట్టి పోటీ ఎదురుకానుంది. మే 15వ తేదీన సుమంత్ హీరోగా నటిస్తున్న 'న్యూటన్స్ థర్డ్ లా' కూడా విడుదలకు సిద్ధమైంది. రాజేష్ కర్ణ దర్శకత్వంలో కర్మ సిద్ధాంతం ఇతివృత్తంగా, మైండ్ బెండింగ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా 'మా ఇంటి బంగారం'తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. ఒకవైపు సామ్ యాక్షన్ థ్రిల్లర్, మరోవైపు సుమంత్ సస్పెన్స్ థ్రిల్లర్.. మొత్తానికి మే నెల సినీ ప్రియులకు అసలైన కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications