నగ్నంగా సమంత..? అభిమానుల షాక్!
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావే సినిమాతో పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు సంపాదించుకుంది. తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇద్దరూ వివాహం చేసుకొని కొంతకాలం తర్వాత విడిపోయారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే సమంతకు మరింత పాపులారిటీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు.
మయోసైటిస్ చికిత్స కోసం ఏడాదిపాటు సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. త్వరలోనే రెండు సినిమాలద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది. తాను ఎక్కడకు వెళుతుంది.. ఏం చేస్తుంది.. లాంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. తాను ఏ పోస్ట్ పెట్టినా నిముషాల్లో వైరలవుతుంది. తాజాగా తన పుట్టినరోజు వేడుకలను ఏథెన్స్ లో జరుపుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తాజాగా సమంత ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు నిరంతరం ప్రత్యామ్నాయ విధానాలను వెతుకుతున్నానని, ఫార్ ఇన్‌ఫ్రారెడ్ ట్రీట్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని, కండరాలకు రక్తప్రసరణ మెరుగ్గా అందుతుందని, జీవక్రియను పెంచడంతోపాటు శరీరంలోని కొవ్వును కూడా తగ్గిస్తుందని తెలిపింది.
తగ్గిన సెల్యులైట్, చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తుందని, కీళ్లు, కండరాల నొప్పిని తగ్గిస్తుందని, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుందని ఆ పోస్టులో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఒంటిపై బట్టలు లేకుండా టవల్ కట్టుకుని ఓ కుర్చీలో కూర్చున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్‌ను చూసినవారంతా షాక్ అవుతున్నారు. మరికొందరైతే కంగారుపడుతున్నారు.
Why is this going viral now.? 😭
— Arpit~Kushwah (@ArpitKushwah3) May 5, 2024
Samantha has deleted her insta story!! #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/F46kMt9g4m












Click it and Unblock the Notifications