అతని ఫొటో షేర్ చేసిన సమంత..ఇక కన్ఫర్మ్ చేసినట్టే..!
టాలీవుడ్, కోలీవుడ్ అనే సరిహద్దులను చెరిపేసి, తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి సమంత రూత్ ప్రభు. కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేసుకుంటూ ఆమె కెరీర్ గ్రాఫ్‌ను అంచలంచెలుగా పెంచుకుంటూ వచ్చింది.2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో సమంత తెలుగు తెరకు పరిచయమైంది. జెస్సీ అనే పాత్రలో ఆమె చూపిన అభినయం యువతను మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
'దూకుడు', 'ఈగ', 'అత్తారింటికి దారేది', 'మనం', 'రంగస్థలం', 'మజిలీ', 'ఓ బేబీ' వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తమిళంలోనూ 'నీతానే ఎన్ పొన్వసంతం', 'తేరి', 'మెర్సల్', 'సూపర్ డీలక్స్' వంటి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఇక సమంత వైవాహిక జీవితం గురించి తెలిసిన విషయమే. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కొన్నేళ్ళ బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. అటు నాగ చైతన్య మాత్రం శోభితను ప్రేమ వివాహం చేసుకున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే సమంత తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్‌తో దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ హ్యాపీ, షాక్, థ్రిల్, యాంగర్, జోష్, ఫన్నీ అంటూ పలు షేడ్స్ ఉన్న పిక్స్‌ను పంచుకుంది. గతంలో వీరిద్దరు 'ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు దర్శక- నిర్మాతలు సీక్వెల్ ప్రకటించారు. దీంతో మరోసారి ఈ వెబ్ సిరీస్‌లో సమంత నటించనుందని కన్ఫర్మ్ చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం సమంత ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications