పెళ్లై, పిల్లలున్న హీరోకు ప్రపోజ్ చేసిన సమంత
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది.
#Powerstar we love you 🤍how cuteeee😙@Samanthaprabhu2 @actor_nithiin pic.twitter.com/Psq3PIeqn2
— అజ్ఞతవాసి🦅🚁 (@TejaPawanist) December 7, 2024
టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత , కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తోంది.

''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే సమంత గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. నితిన్ హీరోగా నటించిన అఆ సినిమాలో హీరోయిన్‌గా సమంత నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నితిన్‌తో కలిసి, పవన్ కల్యాణ్‌కు pawan kalyan we love you అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications