సినిమాల్లో ఆ సీన్స్ పెడితే హిట్ అవుతాయా..? దర్శకుడు శేఖర్ కమ్ముల సంచలనం

టాలీవుడ్ ఓ వైపు మాస్, యాక్షన్ సినిమాలు రాజ్యమేలుతుంటే మంచి కాఫీ లాంటి కూల్ మూవీస్ తో హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఫీల్ గుడ్ సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. 2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు ఆయన. తొలి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ అవార్డు సాధించారు. ఆ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల 2004 లో ఆనంద్ సినిమా తీశారు. ఈ మూవీలో రాజా, కమలినీ ముఖర్జీ నటించారు. ఈ లవ్ స్టోరీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత 2006 లో గోదావరి అనే క్లాసికల్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఈ మూవీలో సుమంత్, కమలినీ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా కనువిందు చేశారు. ఇలా వరుసగా లవ్ స్టోరీస్ తీసుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల 2007 లో హ్యాపీ డేస్ అనే కాలేజీ బ్యాక్ డ్రాప్ మూవీతో సంచలనం సృష్టించారు. అప్పటి ఇంజినీరింగ్ కాలేజీల్లో ఉండే ర్యాగింగ్, ఫ్రెండ్ షిప్, సీనియర్స్- జూనియర్స్ మధ్య వివాదాలు, లవ్ స్టోరీ ఇలా అన్నీ కలబోతగా ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత మరికొంత గ్యాప్ తీసుకుని రానా దగ్గుబాటి హీరోగా లీడర్ అనే పొలిటికల్ డ్రామాను 2010 లో తెరకెక్కించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

అలాగే 2013 లో లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ అనే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించారు. ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత 2014 లో అనామిక అనే సినిమా తీశారు. ఇక 2017 లో వచ్చిన ఫిదా మూవీ శేఖర్ కమ్ముల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ సందేశ్, యంగ్ సెన్సేషన్ సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది. ఈ మూవీతో హీరోయిన్ సాయి పల్లవికి తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ భారీగా అవకాశాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సాయి పల్లవి ప్రతిష్టాత్మక రామాయణ సినిమాలో సీతాదేవిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీతో వరుణ్ సందేశ్ కూడా మంచి హిట్ అందుకున్నారు.

SekharKammula makes remarks It misconception that a film can only be a hit if it contains violence

ఆ తర్వాత 2021 లో శేఖర్ కమ్ముల అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ అలాగే గతేడాది ధనుష్, రష్మిక మందన్న తో తీసిన కుబేర సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫీల్ గుడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన శేఖర్ కమ్ముల.. ఇప్పుడొస్తున్న సినిమాలపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఒక సినిమాలో భారీ వైలెన్స్ ఉండి.. ఆ సినిమా పెద్ద హిట్ అయితే.. ఇక ఇండస్ట్రీలో అదే ట్రెండ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అందులో నిజం లేదు. ట్రెండ్స్ అనేవి అప్పటికప్పుడు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రేక్షకులు మాత్రం ఎప్పుడూ చాలా క్లారిటీతో ఉంటారు. వాళ్లకు ఏం కావాలో అదే చూస్తారు. ముఖ్యంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమాలనే వారు ఎప్పుడూ ఆదరిస్తారు అని కమ్ముల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+