మళ్లీ కలవనున్న మాస్ కాంబో.. 32 ఏళ్ల తర్వాత బాలయ్య మూవీలో విజయశాంతి
నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే వీరు కలిసి చేసిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకున్నాయి. ప్రస్తుతం 'అఖండ' మూవీకి సీక్వెల్ గా అఖండ - 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ '5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫిషీయల్‌గా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్రలో నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో బాలయ్యకు జోడీగా ఎన్నో సినిమాలు చేశారు విజయశాంతి. బాలయ్య, విజయశాంతి జోడీగా తొలిసారి 1984లో "కథానాయకుడు" నటించగా.. చివరిసారిగా 1993లో వచ్చిన "నిప్పు రవ్వ" లో కలిసి కనిపించారు. వీరిద్దరి కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అఖండ సినిమాలో కీలక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారని అంటున్నారు. రీసెంట్‌గానే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విజయశాంతి ఈ చిత్రంలో కనిపిస్తే మళ్లీ ఆ కిక్కే వేరు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో రిలీజ్ డేట్ వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. షూటింగ్ పెండింగ్, గ్రాఫిక్ వర్క్ లో ఆలస్యం కారణంగా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ - సుజీత్ కలిసి చేస్తున్న పీరియడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా " ఓజీ ". ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
దాంతో 'అఖండ 2' వాయిదా పడితే 'ఓజీ'ని తీసుకురావాలని చూస్తున్నారట ఆ మవవీ నిర్మాతలు. ప్రస్తుతం ఓజీ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తయితే వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఇదే జరిగితే రెండు సినిమాలకి కలెక్షన్స్ విషయంలో గండి పడే ఛాన్స్ ఉందని అందుకే బాలయ్య మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications