అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి బ్యాడ్ న్యూస్
బాలీవుడ్‌లో బెస్ట్ కపూల్ అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ జంట. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల నడుమ వీరి వివాహం జరిగింది. ఐశ్వర్యరాయ్ అప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోలతో రిలేషన్‌లో ఉండటం, సరిగ్గా పెళ్లికి ముందు అభిషేక్ బచ్చన్ తనని మోసం చేశాడంటూ ఓ యువతి హంగామా సృష్టించింది. దీంతో వివాదాల మధ్య వీరి పెళ్లి జరిగింది. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్‌లు విడిపోతున్నారనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు. బిగ్ బి అమితాబ్ తన కొడులు ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే అమితాబ్ ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకుంటున్నారు. ఇటీవల అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది.

ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్యరాయ్ చేసిన ఓ పనితో వీరి విడాకులు ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఐశ్యర్య, ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి ఈ జంట విడాకులు గురించి చర్చకు వచ్చింది. ఇది చాలదన్నట్టు బచ్చన్ ఫ్యామిలీ మరో ఘటన చోటు చేసుకుంది.
అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ కూతురు నవ్య నవేలి నందాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో అమితాబచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా రిలేషన్‌లో ఉన్నారని, గత కొంతకాలంగా మీడియాలో వార్తలొస్తున్నాయి. వీరిద్దరు కలిసి బయట పలుమార్లు దర్శనం ఇచ్చారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు మరోవైపు నవ్య నవేలి నందా బ్రేకప్‌తో బచ్చన్ ఫ్యామిలీకి వరుస బ్యాడ్ న్యూస్‌లంటూ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications